EMK: ఎన్టీఆర్ షోకి అతిథులుగా దేవిశ్రీ, తమన్

pratap reddy   | Asianet News
Published : Oct 16, 2021, 07:54 PM IST
EMK: ఎన్టీఆర్ షోకి అతిథులుగా దేవిశ్రీ, తమన్

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గ వ్యవహరిస్తున్న సూపర్ హిట్ షో ఎవరు మీలో కోటీశ్వరులు (EMK ) సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్టీఆర్ తన వాక్ చాతుర్యంతో అలరిస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గ వ్యవహరిస్తున్న సూపర్ హిట్ షో ఎవరు మీలో కోటీశ్వరులు (EMK ) సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్టీఆర్ తన వాక్ చాతుర్యంతో అలరిస్తున్నారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధిస్తున్నాడు. గ్యాప్ లో వారితో మాట మాట కలిపి సరదాగా ముచ్చటిస్తున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే నాలెడ్జ్ పెంచే విధంగా ఉంది. 

ఇక ఈ షోకి సెలెబ్రిటీలు కూడా హాజరవుతూ ప్రేక్షకుల వినోదాన్ని మరింత పెంచుతున్నారు. తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ Ram Charan అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇక దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలసి ఓ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఇటీవల దసరా సందర్భంగా సమంత కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాల్గొంది. 

Mahesh Babu కూడా త్వరలో ఈ షోలో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా దూసుకుపోతున్న Devisri Prasad, Thaman ఎన్టీఆర్ షోలో పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించారు. 

Also Read: చైతు -సమంత విడాకులు : కాంప్రమైజ్ చేసే ప్రయత్నాల్లో రెండు కుటుంబాలు ?

'రాక్ స్టార్ దేవిశ్రీతో కలసి తారక్ అన్న EMK షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అంటూ తమన్ ట్వీట్ చేశాడు. త్వరలో ఈ షో ప్రసారం కానుంది. దేవిశ్రీ, తమన్ ఇద్దరూ ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు. అదుర్స్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందించగా.. బృందావనం, బాద్షా, అరవింద సమేత లాంటి చిత్రాలకు తమన్ సంగీతం అందించారు. 

Also Read: తొలిసారి క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన దీప్తి సునైనా.. లంగాఓణిలో నాభి అందాలు అదుర్స్

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు