
గత ఐదు సీజన్స్ లో ఎప్పుడూ లేనంత చప్పగా బిగ్ బాస్ 5 సాగుతుంది. లెక్కకు మించిన కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం థ్రిల్ ఫీల్ కావడం లేదు. హౌస్ లో నిరంతరం గొడవలు, కొట్లాటలు జరుగుతున్నా, సిరి, షణ్ముఖ్ వంటి జంటలతో రొమాన్స్ కొనసాగిస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోతుంది. దీనికి తోడు లీక్స్ వలన Bigg boss show ఎపిసోడ్స పై ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు.
ఇక నేడు శనివారం కావడంతో Elimination పై మరో లీక్ వచ్చేసింది. ఈ వారం హౌస్ ని వీడే కంటెస్టెంట్ ఇతడే అంటూ ఓ పేరు ప్రచారంలోకి వచ్చేసింది. గత ఐదు వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న విషయం ముందుగానే తెలిసిపోతుంది. మొదటి వారం ఎలిమినేట్ అయిన సరయు దగ్గర నుండి, గత వారం ఎలిమినేట్ అయిన హమీదా వరకు ఇదే పరిస్థితి.
బిగ్ బాస్ హౌస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించారు. దీని వలన ఈజీగా బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన విషయాలు లీక్ అవుతున్నారు. ఇక ఈ వారం ఏకంగా పది మంది ఎలిమినేషన్స్ లో ఉన్నారు. షణ్ముఖ్, సిరి, ప్రియాంక, లోబో, శ్రీరామ్ ,రవి, విశ్వ, శ్వేత, సన్నీ, జస్వంత్ ఇలా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ లో 10 మంది ఎలిమినేషన్ నామినేషన్స్ లో ఉన్నారు.
Also read Bigg Boss telugu5... వరస్ట్ పెరఫార్మర్ గా జైలుపాలైన శ్వేత... సిరి, షణ్ముఖ్ మధ్య గిల్లి కజ్జాలు!
అయితే ఈ పది మంది ఇంటి సభ్యులలో హై రిస్క్ లో Lobo ఉన్నారట. అతడు ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు. దీనికి సంబంధించిన లీక్ బయటికి రావడంతో ఖచ్చితంగా లోబో అవుట్ అన్న మాట వినిపిస్తుంది.
Also read 'ఖైదీ' ప్రొడక్షన్ హౌస్ లో సమంత కొత్త చిత్రం!
మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. సప్పగా సాగుతున్న హౌస్ ని డబుల్ ఎలిమినేషన్స్ తో జర్క్ ఇచ్చి, వైల్డ్ కార్డు ఎంట్రీలు ప్రవేశ పెట్టే ఆస్కారం కలదట. మరి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా, ఏం జరుగుతుందో చూడాలి.