Leo Trailer Date : ‘లియో’ ట్రైలర్ కు డేట్ ఫిక్స్... ఎప్పుడు.? అఫీషియల్ అప్డేట్

Published : Oct 02, 2023, 07:43 PM IST
Leo Trailer Date :  ‘లియో’ ట్రైలర్ కు డేట్ ఫిక్స్... ఎప్పుడు.? అఫీషియల్ అప్డేట్

సారాంశం

‘లియో’ ట్రైలర్ అప్డేట్ పై ఏర్పడ్డ ఉత్కంఠకు తెరపడింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న అప్డేట్ వచ్చేంది. తాజాగా మేకర్స్  Leo Trailer డేట్ ను  అనౌన్స్ చేశారు.   

తమిళ స్టార్ దళపతి విజయ్ (Vijay Thalapathy)  ప్రస్తుతం భారీ యాక్షన్ ఫిల్మ్  ‘లియో’ (Leo)తో రాబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై భారీ హైప్ నెలకొంది. మార్కెట్ లో హై డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పటికే పలు అప్డేట్స్  అందించి తారాస్థాయి అంచనాలను క్రియేట్ చేశారు. 

కాగా, Leo Trailer కోసం అభిమానులు కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికన లోకేష్ కనగరాజ్, నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోకు వరుసగా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడంటూ చాలా ఉత్కంఠ పెరిగింది. తాజాగా మేకర్స్  లియో ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేశారు. అక్టోబర్ 5న ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు కొద్ది సేపటి కిందనే అప్డేట్ అందించారు. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక అనౌన్స్ మెంట్ తో వదిలిన పోస్టర్ లో..  తోడేలుతో విజయ్ పోరాడుతున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. మొత్తానికి ట్రైలర్ డేట్ ఫిక్స్ చేయడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. 

చివరిగా విజయ్ దళపతి ‘వారసుడు’ చిత్రంతో అలరించారు. ఇప్పుడు ‘లియో’తో రాబోతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ రూ.300 కోట్లతో నిర్మించారు. స్టార్ హీరోయిన్ త్రిష 14 ఏళ్ల తర్వాత విజయ్ సరసన నటిస్తుండటం విశేషం. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ కూడా అందనుంది. 

 

PREV
click me!

Recommended Stories

The RajaSaab Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాని కాపాడిన సీన్లు అవే, ప్రభాస్ కష్టం వృధానేనా ?
Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!