నాగ చైతన్య సింప్లిసిటీ చూశారా.. తన సిబ్బంది బైక్ పై రైడ్, వీడియో వైరల్

Published : Oct 02, 2023, 05:33 PM IST
నాగ చైతన్య సింప్లిసిటీ చూశారా.. తన సిబ్బంది బైక్ పై రైడ్, వీడియో వైరల్

సారాంశం

అక్కినేని నాగ చైతన్య త్వరలో చందు ముండేటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చైతు తన కెరీర్ లోనే వైవిధ్యమైన పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

అక్కినేని నాగ చైతన్య త్వరలో చందు ముండేటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చైతు తన కెరీర్ లోనే వైవిధ్యమైన పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సముద్రంలో చేపల వేట సాగించే జాలరి పాత్రలో చైతు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి రెండవసారి హీరోయిన్ గా నటిస్తోంది. 

సాయి పల్లవి, చైతు ఇదివరకే లవ్ స్టోరీ చిత్రంలో నటించారు.  చైతు కోసం చందు ముండేటి ఎంతో ఆసక్తికరమైన స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇప్పటికే చైతు ఈ చిత్రం కోసం స్వయంగా సముద్రంలో బోట్ నడిపే మత్స్యకారులని కలసి వారి అనుభవాలని తెలుసుకున్నారు. చైతు కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టు కాబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 

ఇదిలా ఉండగా తాజాగా నాగ చైతన్య తన సింప్లిసిటీ చాటుకున్నారు. తన సిబ్బందిలో ఒకరు కొత్త బైక్ కొన్నారు. దీనితో తన సిబ్బంది కోరిక మేరకు నాగ చైతన్య బైక్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చి.. రైడ్ చేశారు. దీనితో అతడు చాలా సంతోషించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

చైతు ఫ్యాన్స్ అంతా ఈ వీడియో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తన సిబ్బందితో ఫోటో దిగేటప్పుడు నాగచైతన్య పెట్ వచ్చింది. దీనితో చైతు ఆ పెట్ ని పక్కకి పంపిన విధానం కూడా క్యూట్ గా ఉంది. ఈ వీడియోలో ఆ దృశ్యాలు చూడొచ్చు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌