Bigg Boss Telugu 7: నామినేషన్స్ లిస్ట్ లీక్... ఎంత మంది ఉన్నారంటే!

Published : Oct 02, 2023, 04:03 PM IST
Bigg Boss Telugu 7: నామినేషన్స్ లిస్ట్ లీక్... ఎంత మంది ఉన్నారంటే!

సారాంశం

సోమవారం వచ్చిందంటే కంటెస్టెంట్స్ మధ్య వాడివేడి వాతావరణం నెలకొంటుంది. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.   

బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారంలోకి ఎంటర్ అయ్యింది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో పవర్ అస్త్ర గెలిచిన సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ నుండి మినహాయింపు పొందుతారు. శివాజీ తన పవర్ అస్త్ర కోల్పోయిన నేపథ్యంలో అతడు నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనాలి. ఇక టేస్టీ తేజా హోస్ట్ నాగార్జున చేత నేరుగా నామినేట్ చేయబడ్డాడు. కాబట్టి అతడు ఆల్రెడీ నామినేట్ అయ్యాడు కాబట్టి అతన్ని ఎవరూ నామినేట్ చేయరు. 

కాబట్టి శివాజీ, ప్రియాంక, గౌతమ్, శుభశ్రీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొంటారు. ఈ వారం నామినేట్ చేసే వ్యక్తి గుండెల్లో బాకు దించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ప్రతి కంటెస్టెంట్ మెడకు మందపాటి షీట్ తగిలించుకుని ఉంటారు. తగిన కారణాలు చెప్పి నామినేట్ చేసిన కంటెస్టెంట్ మెడలో ఉన్న షీట్ కి కత్తి గుచ్చాలి. ఈ నామినేషన్స్ ప్రక్రియలో శివాజీతో ప్రియాంక, అమర్ దీప్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. అలాగే ప్రియాంక, ప్రిన్స్ యావర్ కూడా గొడవపడ్డారు. 

పవర్ అస్త్ర గెలిచిన సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ మినహాయించి అందరూ నామినేట్ అయినట్లు సమాచారం. టేస్టీ తేజా శిక్షలో భాగంగా నేరుగా నామినేట్ అయ్యాడు. ఇక నామినేషన్స్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలి. ఈ క్రమంలో అమర్ దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శివాజీ, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ నామినేట్ అయినట్లు తెలుస్తుంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి... 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్