విజయ్ 'వారసుడు' ట్రైలర్ చూసారా.. ట్రిపుల్ ఇచ్చేస్తాడట!

Published : Jan 04, 2023, 08:31 PM ISTUpdated : Jan 04, 2023, 08:34 PM IST
విజయ్ 'వారసుడు' ట్రైలర్ చూసారా.. ట్రిపుల్ ఇచ్చేస్తాడట!

సారాంశం

ట్రైలర్ చూస్తే...ఈ సినిమాలో హీరో ఉమ్మడి కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబం పాలిట విలన్ గా తయారవుతాడు ప్రకాశ్ రాజ్.    

ఈ సారి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.  చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న వస్తోంది. బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి' జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినవే కావడం గమనార్హం. మరోవైపు తమిళ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మించిన 'వారసుడు' సినిమా కూడా జనవరి 12నే విడుదల కాబోతోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.  ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు సాయింత్రం ట్రైలర్ రిలీజ్ చేసారు. 
 

ట్రైలర్ చూస్తే...ఈ సినిమాలో హీరో ఉమ్మడి కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబం పాలిట విలన్ గా తయారవుతాడు ప్రకాశ్ రాజ్. అతన్ని ఎదిరించి తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడనేదే కథ అనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థమవుతోంది.  విజయ్ సరసన హీరోయిన్ గా రష్మిక సందడి చేయనున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ .. సుమన్ .. ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శ్యామ్ .. జయసుధ .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ నుంచి వచ్చిన పాటల్లో రంజితమే సాంగ్ బాగా హిట్  అయిన సంగతి తెలిసిందే .

'వారసుడు' సినిమాకు సంబంధించి దిల్ రాజు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు హీరోగా తొలుత విజయ్ ను అనుకోలేదని చెప్పారు. మహేశ్ బాబుతో ఈ చిత్రాన్ని చేయాలని వంశీ పైడిపల్లి అనుకున్నారని, అయితే వేరే ప్రాజెక్ట్ తో మహేశ్ బిజీగా ఉండటం వల్ల కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత రాంచరణ్ తో అనుకున్నామని, కానీ ఆయన అప్పటికే తన తదుపరి సినిమా డిస్కషన్ లో ఉండటంతో సాధ్యపడలేదని తెలిపారు. దీంతో, చివరకు ఈ సినిమా విజయ్ వద్దకు వెళ్లిందని అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే