సూర్య చిత్రానికి రూ 100 కోట్ల బంపర్ ఆఫర్.. షూటింగ్ పూర్తికాకముందే లాభాలు..

By team teluguFirst Published Jan 4, 2023, 5:15 PM IST
Highlights

తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానం సొంతం చేసుకున్న నటుడు సూర్య. గజినీగా, సింగంగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు.

తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానం సొంతం చేసుకున్న నటుడు సూర్య. గజినీగా, సింగంగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. సూర్య చివరగా నటించిన చిత్రం ఈటి. మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీనితో సూర్య తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు.

ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు. ఆ మధ్యన విడుదలైన మోషన్ పోస్టర్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటి నుంచే అంచనాలు పెంచేస్తున్న ఈ చిత్రానికి ఆఫర్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. 

సూర్య నటిస్తున్న పీరియాడిక్ చిత్రం కావడంతో డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం కొన్ని సంస్థలు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం ఓ సంస్థ నిర్మాతలకు రూ 100 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు  తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు ఈ డీల్ ని ఒకే చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు ఈ చిత్ర షూటింగ్ 60 శాతం మాత్రమే పూర్తయింది. అయినప్పటికీ నిర్మాతలకు లాభాలు మొదలయ్యాయి. సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిశా పటాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సూర్య ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో రోలెక్స్ పేరుతో ప్రత్యేక పాత్రలో నటించారు. మరోవైపు సూర్య సింగం 4కి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

click me!