దసరా రోజు విజయ్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్!

By Udayavani Dhuli  |  First Published Oct 10, 2018, 2:10 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గతంలో మురుగదాస్ రూపొందించిన సినిమాలలో నటించారు. తమిళనాట వీరిద్దరిది క్రేజీ కాంబినేషన్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో 'సర్కార్' అనే సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గతంలో మురుగదాస్ రూపొందించిన సినిమాలలో నటించారు. తమిళనాట వీరిద్దరిది క్రేజీ కాంబినేషన్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో 'సర్కార్' అనే సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ పక్క షూటింగ్ నిర్వహిస్తూనే మరోపక్క సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. సినిమా టీజర్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Latest Videos

undefined

విజయదశమి కానుకగా అక్టోబర్ 19న సినిమా టీజర్ ని విడుదల చేయనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ నేపధ్యంలో సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన వేడుకలో విజయ్ ఎమోషనల్ స్పీచ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తను నిజంగానే సీఎం అయితే అవినీతి అంతు చూస్తా అంటూ ఆవేశంగా మాట్లాడారు. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ జంటగా కనిపించనుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

 

pic.twitter.com/je2qdA1g64

— Sun Pictures (@sunpictures)
click me!