విజయ్ చివరి చిత్రం గోట్ ట్రైలర్ ఎలా ఉంది? డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు, హైలైట్స్ ఇవే!

By Sambi Reddy  |  First Published Aug 17, 2024, 6:44 PM IST

దళపతి విజయ్ చివరి చిత్రం ది గోట్. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. 
 


కోలీవుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). విజయ్ నటించే చివరి చిత్రం ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విజయ్ ఇకపై నటించేది లేదని చెప్పారు. కాబట్టి ది గోట్ అనంతరం ఆయన చిత్రాలు చేయకపోవచ్చు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు. తమిళగ వెట్రి కజగం పేరుతో ఒక పార్టీని స్థాపించారు. దాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు. 

ఆగస్టు 17న ది గోట్ ట్రైలర్ విడుదల చేశారు. దాదాపు మూడు నిమిషాల వ్యవధి కలిగిన ది గోట్ ట్రైలర్ ఆకట్టుకుంది. ది గోట్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన స్పై థ్రిల్లర్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.  విజయ్ తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపిస్తున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి విజయ్ లీడర్. అరవైకి పైగా సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ పూర్తి చేసిన సమర్ధుడైన స్పై ఏజెంట్. దాంతో విజయ్ టెర్రరిస్ట్స్ కి టార్గెట్ అవుతాడు. యంగ్ అండ్ ఓల్డ్ గెటప్స్ లో విజయ్ రెండు భిన్నమైన లుక్స్ ట్రై చేశారు. 

Latest Videos

ది గోట్ చిత్రంలో భారీ క్యాస్ట్ నటించారు. ప్రభుదేవా, ప్రశాంత్, వైభవ్, అజ్మల్ అమీర్, జయరామ్, యోగిబాబు, స్నేహ, లైలా... ఇలా లెక్కకు మించిన స్టార్స్ భాగమయ్యారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ పరిశీలిస్తే విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్. ఉన్నత నిర్మాణ విలువలతో ది గోట్ ఆడియన్స్ కి హాలీవుడ్ మూవీ రేంజ్ అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. 

మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంది. ది గోట్ చిత్రంపై అంచనాలు పెంచేసింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ది గోట్ బీజేఎం పర్లేదు అని చెప్పాలి. సెప్టెంబర్ 5న ది గోట్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ నిర్మించారు. ది గోట్ విజయ్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. మీరు కూడా ట్రైలర్ పై ఓ లుక్ వేయండి.. 
 

click me!