జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రాలు.. కంప్లీట్ లిస్ట్ ఇదిగో

By tirumala AN  |  First Published Aug 16, 2024, 2:29 PM IST

70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన ప్రారంభం అయింది. జాతీయ అవార్డుల్లో ఎన్ని తెలుగు చిత్రాలు ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పాన్ ఇండియా వైడ్ గా వసూళ్ల ప్రభంజనం సృష్టించిన కార్తికేయ 2 చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. 


70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన ప్రారంభం అయింది. జాతీయ అవార్డుల్లో ఎన్ని తెలుగు చిత్రాలు ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పాన్ ఇండియా వైడ్ గా వసూళ్ల ప్రభంజనం సృష్టించిన కార్తికేయ 2 చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. 

రీజినల్ లాంగ్వేజ్ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 అవార్డు గెలుచుకుంది. చందు ముండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం 2022లో విడుదలై పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసుకుంది. 

Latest Videos

అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో చందు ముండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. కథ స్క్రీన్ ప్లే చాలా గమ్మత్తుగా ఉంటాయి. అదే విధంగా సెకండ్ హాఫ్ లో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి గురించి చెప్పే మాటలు థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించాయి. అదే విధంగా చందు ముండేటి చూపించిన విజువల్స్ కూడా బాగా హైలైట్ అయ్యాయి. శ్రీకృష్ణుడు చెప్పిన సిద్ధాంతాలు ప్రస్తుత మానవాళికి ఎలా ఉపయోగపడతాయి అనే కోణంలో చందు ముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 అవార్డు గెలవడంతో అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ చిత్రంతోనే హీరో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యారు. కార్తికేయ 2 తో పాటు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్న చిత్రాల జాబితా ఇదే. 

ఉత్తమ చిత్రం: ఆంతం(మలయాళం)
ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ ఆర్‌ బర్జాత్యా(ఊంచై)(హిందీ)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ : ప్రమోద్‌ కుమార్‌(ఫౌజా)
ఉత్తమ నటుడు :  రిషబ్‌ శెట్టి(కాంతార-కన్నడ)
ఉత్తమ నటి :  నిత్యా మీనన్‌(తిరుచిత్రంభలం-తమిళం)- మనసి పరేఖ్‌(కుచీ ఎక్స్ ప్రెస్‌-గుజరాతీ)
ఉత్తమ ప్రజాదారణ పొందిన సినిమా : కాంతార(కన్నడ)
బెస్ట్ ప్రమోటింగ్‌ నేషనల్‌, సోషల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ వ్యాల్యూ :  కుచి ఎక్స్ ప్రెస్‌(గుజరాతీ)
బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్ :  బ్రహ్మాస్త్ర(హిందీ)-జయకర్‌ అరుద్ర, నీలేష్‌(వైరల్‌ థక్కర్‌)
ఉత్తమ సహాయ నటి :  నీనా గుప్తా(ఊంచై-హిందీ)
ఉత్తమ సహాయ నటుడు :   పవన్‌ రాజ్‌ మల్హోత్రా(ఫౌజీ-హర్యాన్వి)
ఉత్తమ బాల నటుడు : శ్రీపత్‌(మలికప్పురం-మలయాళం)

ఉత్తమ గాయకుడు : ఆరిజిత్‌ సింగ్‌(-బ్రహ్మాస్త్ర-కేసారియా-హిందీ)
ఉత్తమ గాయని : బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క-సౌదీ బేబీ కొకనట్‌- మలయాళం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : రవి వర్మన్‌(పొన్నియిన్‌ సెల్వన్‌ -తమిళం)
బెస్ట్ స్క్రీన్‌ ప్లే(ఒరిజినల్) : ఆంతం(ఆనంద్‌ ఎకర్షి)
బెస్ట్ డైలాగ్ రైటర్‌ : అర్పిత ముఖర్జీ, రాహుల్‌ వీ చిత్తేల్ల(గుల్మోహర్‌)
బెస్ట్ సౌండ్‌ డిజైన్‌ :  ఆనంద్‌ క్రిష్ణమూర్తి(పీఎస్‌1-తమిళం)
బెస్ట్ ఎడిటింగ్‌ : ఆంతం(మహేష్‌ భువనెండ్‌)
బెస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌(సాంగ్‌) : ప్రీతం( బ్రహ్మాస్త్ర-హిందీ)
బెస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌(బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ : ఏఆర్‌ రెహ్మాన్‌( పీఎస్‌ 1-తమిళం)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ఆనంద అధ్యా(అపరాజితో)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ : అన్బరివ్( KGF చాప్టర్ 2)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : సోమనాథ్ కుందు( అపరాజితో )

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : నికి జోషి( కచ్ ఎక్స్‌ప్రెస్)

ఉత్తమ సాహిత్యం: ఫౌజా(‘సలామీ’కి నౌషాద్ సదర్ ఖాన్)

ఉత్తమ కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్(తిరుచిత్రంబళం- ‘మేఘం కారుకథ’)

స్పెషల్‌ జ్యూరీ అవార్డులుః మనోజ్‌ బాజ్‌పాయ్‌(గుల్‌మోహర్‌), సంజోయ్‌ చౌదురీ(కాధికన్‌)

ఉత్తమ తెలుగు సినిమాః `కార్తికేయ 2`(చందమూ మొండేటి)
ఉత్తమ హిందీ సినిమాః గుల్మోహర్‌
ఉత్తమ తమిళ సినిమాః పొన్నియిన్‌ సెల్వన్‌ 1
ఉత్తమ కన్నడ సినిమాః కేజీఎఫ్‌2
ఉత్తమ మలయాళ సినిమాః  సౌదీ వెల్లక్క
ఉత్తమ మరాఠి సినిమాః వాల్వి 
ఉత్తమ బెంగాలీ సినిమాః కబేరీ అంతార్థన్‌
ఉత్తమ అస్సామీ సినిమాః ఎముతి పుతి
ఉత్తమ ఓడియా సినిమాః డామన్‌
ఉత్తమ తివా సినిమాః సికైసల్‌
 

click me!