దేవర నుంచి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్..హైప్ మరింత పెంచేలా, రెండు గెటప్పుల్లో బాలీవుడ్ స్టార్

By tirumala AN  |  First Published Aug 16, 2024, 6:44 PM IST

దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంపై ఊహకందని అంచనాలు నెలకొని ఉన్నాయి. 


దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంపై ఊహకందని అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం నుంచి బయటకి వస్తున్న ప్రతి అంశం అంచనాలు పెంచేలానే ఉంది. 

నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర చిత్ర యూనిట్ అతడి పాత్రని పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. ఓవరాల్ గా గ్లింప్స్ స్టన్నింగ్ అనిపించేలా ఉంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ బైరా అనే కుస్తీ యోధుడిగా కనిపిస్తున్నాడు. 

Latest Videos

అతడి ముందు కుస్తీలో ఎవ్వరూ నిలువలేకపోతున్నారు. అనిరుధ్ ఇచ్చిన బీజియం అయితే గ్లింప్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్ళింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే గ్లింప్స్ లో సైఫ్ అలీ ఖాన్ రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. ఇది అందరిలో క్యూరియాసిటీ పెంచేస్తోంది. 

 

ఒక రకంగా సైఫ్ అలీ ఖాన్ కి ఇది టాలీవుడ్ లో డెబ్యూ మూవీ. ఆదిపురుష్ చిత్రంలో నటించినప్పటికీ అది కంప్లీట్ గా బాలీవుడ్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన చిత్రం. దేవర చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ఎంత డెడ్లీ విలన్ అనేది సెప్టెంబర్ 27న తేలనుంది. 

click me!