నిర్మాతల మండలి కాంట్రవర్సీ.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు!

Published : May 01, 2019, 10:56 AM IST
నిర్మాతల మండలి కాంట్రవర్సీ.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు!

సారాంశం

తమిళ సినీ నిర్మాతల మండలిలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

తమిళ సినీ నిర్మాతల మండలిలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమిళ సర్కార్ నిర్మాతల మండలి కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించింది. నిర్మాతల మండలికి సంబంధించిన ప్రతీదీ ఆయన పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది.

అయితే ఈ విషయంపై సంతృప్తి చెందని  సంఘం అధ్యక్షుడు ప్రత్యేక అధికారి నియామకాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై  న్యాయమూర్తి రవిచంద్రబాబ్బు మంగళవారం నాడు విచారణ చేపట్టారు. 

విశాల్ తరఫున హాజరైన న్యాయవాది.. నిర్మాత రాధాకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక అధికారిని నియమించడం కరెక్ట్ కాదని, రాధాకృష్ణన్ సంఘంలో అవకతవకలు జరిగాయంటూ చేసిన ఆరోపణలలో నిజం లేదని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిని తొలగించాలని వాదించారు.

వాదనలు విన్న కోర్టు నిర్మాతల మండలి సంఘానికి ప్రత్యేక అధికారి నియామకంపై వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.  తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. 

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే