'జనసేన' పార్టీ డబ్బు పంచడంపై నాగబాబు కామెంట్స్!

By AN TeluguFirst Published May 1, 2019, 10:20 AM IST
Highlights

రాజకీయాల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం. డబ్బు ఉంటేనే పాలిటిక్స్ లో ఏ పనైనా జరుగుతుంది.

రాజకీయాల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం. డబ్బు ఉంటేనే పాలిటిక్స్ లో ఏ పనైనా జరుగుతుంది. ఇక ఎన్నికల సమయంలో ఎంత డబ్బు ఖర్చు పెడతారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని ఇటీవల కొందరు రాజకీయ నేతలు స్వయంగా ఒప్పుకున్నారు.

ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ లో జీరో మనీ పాలిటిక్స్ అనేది సాధ్యం కాదనేది అందరి అభిప్రాయం. అయితే ఖచ్చితంగా అది సాధ్యమవుతుందని అంటున్నారు నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్ధి నాగబాబు. జీరో మనీ పాలిటిక్స్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తను పోటీ చేసిన నరసాపురాల్ నియోజకవర్గం నుండి ఓటర్లు చాలా బాధ్యతగా వచ్చి ఓటేశారని.. ఎప్పుడూ అరవై శాతం మాత్రమే ఓటింగ్ వచ్చే అక్కడఈసారి 81 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైందని అన్నారు. ఇదే తరహాలో కొనసాగితే 2024లో జరగబోయే ఎన్నికల్లో 95 శాతం ఓటింగ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పారు.

95 శాతం ఓటింగ్ వచ్చిందంటే.. డబ్బు అనే కాన్సెప్ట్ పని చేయనట్లేనని.. ఇక ఏ నాయకుడు డబ్బులతో ఓట్లను కొనలేడని అన్నారు. జనసేన పార్టీ తరఫున డబ్బులు పంచకూడదని నిర్ణయం తీసుకున్నామని.

తమతో పాటు వచ్చిన కార్యకర్తలకు భోజనం పెట్టడం, పెట్రోల్ ఖర్చులు చూసుకోవడం వంటివి మాత్రమే చేశామని చెప్పుకొచ్చారు. ఎలెక్షన్ కమిషన్ ఇచ్చిన బడ్జెట్ వచ్చిన మొత్తాన్ని వారికే ఖర్చుపెట్టినట్లు.. అది మినిమమ్ కర్టసీ అని తెలిపారు.    

click me!