రాజమౌళి 'RRR' కు పోటీనా ఈ సినిమా?

By AN TeluguFirst Published May 1, 2019, 10:37 AM IST
Highlights

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ  రూపొందుతున్న చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ  రూపొందుతున్న చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. మళ్లీ సుదీర్గ కాలం తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి..అల్లూరి సీతారామరాజు జీవితాన్ని బేస్ చేసుకుని ఓ క్యారక్టర్ రాసి 'ఆర్ .ఆర్.ఆర్'  టైటిల్ తో చిత్రం తెరకెక్కిస్తున్నారు. అందులో రామరాజు గా రామ్ చరణ్ కనిపించనున్నారు. సీతగా పరిణితి చోప్రా కనిపిస్తుంది.

అయితే తాజాగా మరో చిత్రం అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది.  సీతారామరాజు....ఏ ట్రూ వారియర్‌... అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకుడు. డా।।కె.శ్రీనివాస్‌ నిర్మాత. రిసాలి ఫిల్మ్‌ అకాడమీ అండ్‌ స్టూడియో సమర్పిస్తోంది. ఈ  నెలలో  షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు.  

సునీల్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘వాస్తవిక దృక్పథంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత రెండేళ్లు బ్రిటిష్‌ పాలనపై పోరాడిన చరిత్ర అల్లూరి  సీతారామరాజుది. ఆయన చరిత్రకి జాతీయంగా ఖ్యాతి ఉంది. అందుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు ఇప్పటికే మొదలయ్యాయ’’అన్నారు.  

 

click me!