Latest Videos

‘ఆ.. ఒక్కటీ అడక్కు’ ఏ ఓటిటిలో..ఎప్పటినుంచి అంటే

By Surya PrakashFirst Published May 27, 2024, 11:29 AM IST
Highlights

పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువతీయువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు? ఆ వివాహ వేదికల ద్వారా వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి?  


కెరీర్ ప్రారంభం నుంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో సినీప్రియుల్ని మురిపించిన అల్లరి నరేష్‌ ‘నాంది’తో సీరియస్‌ సినిమాల వైపు టర్న్ అయ్యారు. ఈ క్రమంలో ‘ఉగ్రం’, ‘మారేడుమిల్లి నియోజకవర్గం’ చిత్రాలతో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. దీంతో ఆయన మళ్లీ తన కామెడీ జోన్‌లోకి వచ్చి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రం చేశారు. ట్రైలర్స్, ప్రమోషన్స్  నరేష్‌ స్టైల్ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది.  అయితే ఈ సినిమా థియేటర్లో అనుకున్న స్థాయిలో నవ్వులు పూయించలేకపోయింది.  అల్లరి నరేష్‌ను కెరీర్‌ను మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కించలేదనే చెప్పాలి. అయితే ఉన్నంతలో కొంత కామెడీ అయితే పండింది. ఇప్పుడీ సెమీ కామెడీ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యినట్లు సమాచారం. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘ఆ.. ఒక్కటీ అడక్కు’  సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.ఈ సినిమా మే 31 న స్ట్రీమింగ్ రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.త్వరలోనే మేకర్స్ ఓటిటి రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం .   పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువతీయువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు? ఆ వివాహ వేదికల ద్వారా వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? సదరు సంస్థలు వాళ్ల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నాయన్నది ఈ చిత్రంలో ప్రధానంగా చర్చించారు.  

చిత్రం కథేంటంటే: గణ అలియాస్‌ గణపతి (అల్లరి నరేష్‌) ప్రభుత్వ ఉద్యోగి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో పని చేస్తుంటాడు. తన చేతుల మీదుగా వందల వివాహాలు జరిపించిన అతనికి మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాదు. కానీ, తన కంటే ముందు తమ్ముడు (రవికృష్ణ)కు మేనమామ కూతురు (జెమీ లివర్‌)ను ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఇంట్లో వాళ్లంతా గణ కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు. కానీ, గణ వయసు ఎక్కువనో.. తమ్ముడుకి ముందు పెళ్లి అయిందనో రకరకాల కారణాలు చెప్పి పిల్లను ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. దీంతో చేసేదేమీ లేక ఆఖరి ప్రయత్నంగా హ్యాపీ మ్యాట్రిమోనీలో ప్లాటినం సభ్యుడిగా చేరతాడు. ఆ తర్వాత దాని ద్వారా పరిచయమైన సిద్ధి (ఫరియా అబ్దుల్లా)పై మనసు పారేసుకుంటాడు. కాకపోతే ఆమె గణ పెళ్లి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తుంది. 

ఈ క్రమంలోనే జబ్బు పడిన తన తల్లిని సంతోష పెట్టేందుకు ఓసారి సిద్ధిని తన ప్రియురాలిగా ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాడు. కట్‌ చేస్తే.. ఆ మరుసటి రోజే సిద్ధి గురించి ఓ వార్త బయటకొస్తుంది. హ్యాపీ మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే ఖిలాడీ లేడీ అంటూ వార్తల్లోకి ఎక్కుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? నిజంగా సిద్ధి నేపథ్యమేంటి?  ఆమె పని చేస్తున్న మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లి కాని కుర్రాళ్లను ఎలా మోసం చేస్తోంది? వాళ్ల ఆగడాల్ని గణ ఎలా ఆటకట్టించాడు? సిద్ధి గురించి నిజం తెలిశాక తనేం చేశాడు? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే!
 

click me!