Latest Videos

'లవ్ మీ', 'రాజు యాదవ్' కలెక్షన్స్ అప్ డేట్! ఒడ్డున పడతాయా?

By Surya PrakashFirst Published May 27, 2024, 11:06 AM IST
Highlights


లవ్‌ మి సినిమాకు రాజు యాదవ్‌ పోటీగా రావాలని అనుకోలేదు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసి వేయడం వల్ల రాజు యాదవ్‌ ఇప్పటికే విడుదల అవ్వాల్సింది వారం వాయిదా పడింది.
 


ఈ వీకెండ్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.  అందులో ఒకటి జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన గెటప్ శీను(Getup Srinu) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ రాజు యాదవ్(Raju Yadav),మరొకటి దిల్ రాజు బ్యానర్ లో  ఆశిష్(Ashish) హీరోగా నటించిన లవ్ మీ(Love Me Movie). ఓ ప్రక్కన జనం లేక తెలంగాణాలో థియేటర్స్ క్లోజ్ అయ్యిన ఈ సమయంలో ఈ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మన ముందుకు వచ్చాయి. 

లవ్‌ మి సినిమాకు రాజు యాదవ్‌ పోటీగా రావాలని అనుకోలేదు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసి వేయడం వల్ల రాజు యాదవ్‌ ఇప్పటికే విడుదల అవ్వాల్సింది వారం వాయిదా పడింది. ఈ సినిమాలు రెండింటికి నెగిటివ్ టాక్ వచ్చింది. దారుణమైన రివ్యూలు వచ్చాయి. ఐడియా లెవిల్ లో ఈ రెండు సినిమాలు బాగానే ఉన్నా కొత్త దర్శకులు తమ అనుభవ లేమితో వాటిని పాడు చేసారని అని తేల్చారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాల కలెక్షన్స్ పరిస్దితి ఏమిటో చూద్దాం. 
 
మొదట శుక్రవారం రిలీజైన రాజు యాదవ్ విషయానికి వస్తే గెటప్ శీను పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా  ఓవరాల్ గా సినిమా మాత్రం  అంచనాలను అందుకోలేక చతికిల పడిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు.  రాజు యాదవ్ సినిమా…శుక్ర,శనివారాలు రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి బుక్ మై షోలో సినిమా పేరు మీద కేవలం 7 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ మాత్రమే అయ్యాయి.

 ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా రెండు రోజుల్లో ఓవరాల్ గా 55-60 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని  తెలుస్తోంది. అంటే ఓవరాల్ కలెక్షన్స్  26 లక్షల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ లో  అంచనా…ఆదివారం కూడా ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ లేదు. మొత్తం మీద చిన్న సినిమాకి ఇవి ఓకే అనిపించే రేంజ్ కలెక్షన్స్ అనుకున్నా సరిపోవు.  అలాగే  సినిమా బిజినెస్ రేంజ్ 1.5 కోట్ల దాకా ఉంటుందని  తెలుస్తోంది. కానీ ఆ స్దాయిని అందుకోవటం కష్టమే.  

మరో ప్రక్క ప్రతిష్టాత్మకమైన దిల్ రాజు  బ్యానర్ నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆశిష్(Ashish) హీరోగా నటించిన లవ్ మీ(Love Me Movie) కూడా అంతంత మాత్రంగానే కలెక్షన్స్ ఉన్నాయి. ఈ  మూవీ ట్రైలర్ క్లిక్ అయినా సినిమాకి  డివైడ్ టాక్  వచ్చింది.  సోషల్ మీడియాలో సినిమా నెగిటివ్ టాక్ గట్టిగానే స్ప్రెడ్ అయింది అని చెప్పాలి.
 
దాంతో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కోటి రేంజ్ లో షేర్ ని అందుకుందని తెలుస్తోంది. అయితే సినిమా మేకర్స్ 4.5 కోట్లు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు కానీ అది పబ్లిసిటీ కోసం చేసిన పోస్టరే అంటున్నారు.  ట్రేడ్ లెక్కల్లో 2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు అందుకున్న లవ్ మీ మూవీ ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న డల్ సీజన్ లో   మంచి ఓపెనింగ్స్ నే అందుకున్నట్లు చెప్పాలి. రెండో రోజు  సండే అడ్వాంటేజ్ తో మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించింది. అయితే  నైట్ షోలటైం కి IPL ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ వలన బాగా  డ్రాప్స్ ఉంది. అయినా ఉన్నంతలో రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపించిందని అంచనా. అయితే ఇవి అఫీషియల్ లెక్కలు మాత్రం కావు. 

click me!