Latest Videos

#Kalki2898AD: ఆ ఫార్మెట్ లో కూడా ‘కల్కి’..మూమూలు ప్లానింగ్ కాదుగా

By Surya PrakashFirst Published May 27, 2024, 11:12 AM IST
Highlights

 రిలీజ్ కు నెల మాత్రమే టైమ్ ఉండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచుతున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి ...


 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “పై ఏ రేంజి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ముఖ్యంగా రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో బుజ్జి కారుని లాంచ్ చేసాక ఆ ఎక్సపెక్టేషన్స్ రెట్టింపు అయ్యిపోయాయి. అందరి దృష్టి ఈ సినిమాపై కేంద్రీకృతం అయ్యింది . మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించటంతో నార్త్ లో కూడా బజ్ మామూలుగా లేదు. దానికి తోడు గతంలో ఎన్నో సక్సెస్  ఫుల్ సినిమాలు ఇచ్చిన వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాస్ నుంచి ఈ సినిమా వస్తూండటం. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంభందించిన చిన్న న్యూస్ కూడా వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం గురించిన మరో వార్త ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తోంది. 

అదేమిటంటే..ఈ సినిమా త్రీడీ ఫార్మెట్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఈ విషయమై నిర్మాతల నుంచి ఏ అప్డేట్ రాలేదు కానీ ఖచ్చితంగా ఆ వెర్షన్ లో సినిమా ఉందని తెలుస్తోంది.   రిలీజ్ కు నెల మాత్రమే టైమ్ ఉండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచుతున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

 6000 ఏళ్ల నాటి కథ కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు గతంలో నాగ్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి.  ఈ సినిమా కోసం భారీ సెట్లు, అద్భుత‌మైన కాస్ట్యూమ్స్, భారీత‌నం నిండిన సెట్ల‌లో పాట‌ల్ని తెర‌కెక్కించ‌డంతో విజువ‌ల్ ఫీస్ట్ గా ఉంటుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించి, పాన్ ఇండియాలో విడుద‌ల చేస్తోంది.  
  
నాగ్ అశ్విన్ రీసెంట్ ఓ మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. 

ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్.  ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  కల్కి తో పాటు రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాలు .. ప్రభాస్ కు క్యూలో ఉన్నాయి.  

 

click me!