నీహారికకి కరోనా భయం

Surya Prakash   | Asianet News
Published : Jan 11, 2021, 09:09 AM IST
నీహారికకి కరోనా భయం

సారాంశం

ఓ కార్య‌క్ర‌మం నిమిత్తం ఈ రోజు ఉద‌యం క‌ర్నూలుకు వెళ్దామ‌ని ఉద‌యాన్నే లేచాను. నాలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో నా ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకున్నాను. వీలైనంత త్వ‌ర‌గా వైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకుంటాను. నా టెస్ట్‌ రిజల్ట్స్‌ గురించి తెలియజేస్తాను.  ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వాళ్లు కూడా ఓసారి టెస్ట్ చేయించుకోండి. అంద‌రూ జాగ్ర‌త్త’అని అన‌సూయ ట్వీట్ చేశారు.  

కరోనా సమస్య సినిమావాళ్లను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వదలటం లేదు. సినిమా టీమ్ లో ఒకరికి కరోనా వచ్చిందంటే యూనిట్  మొత్తం టెస్ట్ లు చేయించుకోవాల్సిన పరిస్దితి. రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, వరుణ్ తేజలకు కరోనా వచ్చి తగ్గుమొహం పట్టింది. వాళ్లకు రావటంతో కుటుంబంలో అందరూ పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు ఈ కరోనా తలనొప్పి కొత్త పెళ్లి కూతురుని ఇబ్బందిపెడుతోంది.
 
రీసెంట్ గా హనీమూన్ ట్రిప్ నుంచి రాగానే నిహారిక ఒక కొత్త వెబ్ సిరీస్ ని ఒప్పుకోవటమే కాక..  ఆ వెబ్ సిరీస్ లాంచ్ కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఇప్పుడు అదే  ఆమెని టెన్షన్ లో పడేసింది. ఈ ఓపెనింగ్ కార్యక్రమం మూడు రోజుల క్రితమే జరిగింది. ఈ ఈవెంట్ కి నటి అనసూయ కూడా వచ్చింది. అయితే తాజాగా అనసూయకి కరోనా లక్షణాలు భయటపడ్డాయిట.ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఆమెకి కరోనా వచ్చిందా లేదా అన్నది ఇంకా టెస్ట్ లో తేలలేదు.
 
ఓ కార్య‌క్ర‌మం నిమిత్తం ఈ రోజు ఉద‌యం క‌ర్నూలుకు వెళ్దామ‌ని ఉద‌యాన్నే లేచాను. నాలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో నా ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకున్నాను. వీలైనంత త్వ‌ర‌గా వైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకుంటాను. నా టెస్ట్‌ రిజల్ట్స్‌ గురించి తెలియజేస్తాను.  ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వాళ్లు కూడా ఓసారి టెస్ట్ చేయించుకోండి. అంద‌రూ జాగ్ర‌త్త’అని అన‌సూయ ట్వీట్ చేశారు.  

దాంతో  ఇప్పుడు నిహారిక, ఆమె భర్త చైతన్య కూడా కొద్దిరోజులు ఐసొలేషన్ లో ఉండాలి. లక్షణాలు వెంటనే బయటపడవు కదా. కాబట్టి ఏమవుతుందో అన్న టెన్షన్ మరో నాలుగైదు రోజులు నిహారికకి తప్పదు . అనసూయ అనుమానం నిజమై.. పాజిటివ్‌ వస్తే.. నిహారిక కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోక తప్పదు.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు