ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ చిత్రం షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నట్లు టాక్. గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే.
అభిమానులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు నేటి తరం యంగ్ హీరోలు. వారి సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ రోజు ఓపినింగ్స్ దగ్గర నుంచి వంద రోజుల పండగ బ్యానర్స్ కట్టేదాకా వాళ్ల సహకారం లేనిదే ఏమీ చెయ్యలేరు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. వేరే హీరోల ఫ్యాన్స్ తో ఉత్సాహంగా యుద్దాలు సైతం చేస్తూంటారు. తమకు తమ హీరోని ఎలా చూడాలని ఉందో డిస్కషన్స్ చేస్తూంటారు. టైటిల్స్ దగ్గరనుంచి తమ అభిప్రాయం నిర్మహమాటంగా వెల్లడిస్తూంటారు. అలాంటిదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్నారు.
ఎన్టీయార్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ప్రకటించడమే ఆలస్యం.. టైటిల్ నుంచి మొదలుపెట్టి నటీనటులు.. కథ.. క్లైమాక్స్ ఇలా అన్ని విషయాల్లో మీడియాలో ఏవేవో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్ల కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తప్పితే ఎలాంటి వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అయితే.. ఆ మధ్య ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అదే ‘చౌడప్పనాయుడు’.
ఈ టైటిల్‌ను చిత్ర టీమ్ పరిశీలిస్తోందని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఈ టైటిల్ ని చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు ఇష్టపడటం లేదు. ఎన్టీఆర్ ఈ టైటిల్ కు నో చెప్పాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఖరారు చేయమని అడుగుతున్నారు.ఇక ఈ టైటిల్ వార్తలో నిజమెంతో తెలియాలంటే దర్శకనిర్మాతల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
అందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పనులు తర్వలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ లో ఉన్నారు తారక్. ఆ సినిమా పూర్తవగానే త్రివిక్రమ్‌తో కలిసి పని ప్రారంభించనున్నారు. కాగా.. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ‘ఎన్టీఆర్30.. త్వరలోనే పట్టాలెక్కబోతోంది’ అంటూ కొత్త సంవత్సర సందర్భంగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు.