రూ.3 కోట్లతో ఫ్లాట్, కోటి రూపాయల కారు కొన్న యాంకర్!

Published : Sep 13, 2019, 04:27 PM ISTUpdated : Sep 14, 2019, 03:06 PM IST
రూ.3 కోట్లతో ఫ్లాట్, కోటి రూపాయల కారు కొన్న యాంకర్!

సారాంశం

త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హరితేజ హీరోయిన్ పనిమనిషి పాత్రలో కనిపించి మంచి ఫన్ క్రియేట్ చేసింది. అప్పటినుండి ఈమెకి అవకాశాలు బాగానే పెరిగాయి. 

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం అంత సులువైన పని కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ హరితేజ కూడా ఒకరని చెప్పాలి. టీవీ సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2007 నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.

ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు 'అ ఆ' సినిమాతో అందుకుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హరితేజ హీరోయిన్ పనిమనిషి పాత్రలో కనిపించి మంచి ఫన్ క్రియేట్ చేసింది. అప్పటినుండి ఈమెకి అవకాశాలు బాగానే పెరిగాయి.

బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టంట్ గా పాల్గొని ఆమె పంచిన ఫన్ అంతా ఇంతా కాదు. బుర్రకథ అంటూ బిగ్ బాస్ హౌస్ ని అల్లాడించింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత నటిగా, యాంకర్ గా ఆమెకి ఛాన్స్ లు పెరిగాయి. ప్రస్తుతం తన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న హరితేజ రీసెంట్ గా ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ని సొంతం చేసుకుంది.

హైదరాబాద్ లో ఓ రిచ్ ఏరియాలో రూ.3 కోట్లు పెట్టి మరీ అపార్ట్మెంట్ కొనుక్కుంది. గృహప్రవేశం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలానే కోటి రూపాయల విలువైన కారుని కూడా సొంతం చేసుకుంది. ఒకరకంగా దీనంతటికీ కారణం త్రివిక్రమ్ అనే చెప్పాలి. అతడిచ్చిన బ్రేక్ తోనే హరితేజ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. 

ఈ బ్యూటీలు బికినీ వేస్తే... చలికాలంలో కూడా చమటలు పట్టాల్సిందే!

బాక్స్ ఆఫీస్ హీరోస్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్
 
 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌