గ్యాంగ్ లీడర్ కి పోలాండ్ సినిమాటోగ్రాఫర్.. ఏం జరిగిందంటే?

Published : Sep 13, 2019, 04:04 PM IST
గ్యాంగ్ లీడర్ కి పోలాండ్ సినిమాటోగ్రాఫర్.. ఏం జరిగిందంటే?

సారాంశం

న్యాచురల్ స్టార్ నాని - స్క్రీన్ ప్లే మాస్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ తో నడుస్తోంది. అయితే సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ లో ఒక పర్సన్ జనాలను బాగా ఎట్రాక్ట్ చేశాడు.

న్యాచురల్ స్టార్ నాని - స్క్రీన్ ప్లే మాస్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ తో నడుస్తోంది. అయితే సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ లో ఒక పర్సన్ జనాలను బాగా ఎట్రాక్ట్ చేశాడు. అతనే సినిమాటోగ్రాఫర్ మిరోస్ల బ్రోజెక్ ఖుబా. 

పోలాండ్ కి చెందిన ఈ కెమెరామెన్ ని ఎంచుకోవడానికి అసలు కారణాన్ని నాని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లుప్తంగా వివరించాడు. మొదట ఈ సినిమా కోసం సీనియర్ సినిమాటోగ్రాఫర్ పిసి.శ్రీరామ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితుల కారణంగా సినిమా చేయలేకపోతున్నా అని షూటింగ్ కి కొన్ని రోజుల ముందు షాక్ ఇచ్చారట. దీంతో దర్శకుడు విక్రమ్ పోలాండ్ కి చెందిన స్నేహితుడి ద్వారా మిరోస్ల బ్రోజెక్ ఖుబా ని కాంటాక్ట్ చేశాడు. 

పోలాండ్ అంటే సినిమాటోగ్రాఫర్స్ కి స్పెషల్ అడ్డా. హాలీవుడ్ దర్శకులు సైతం అక్కడి నుంచి కెమెరామెన్ లను వెతుక్కుంటారు. అయితే ఖుబా మేకింగ్ కి సంబందించిన కొన్ని వీడియో ఫుటేజ్ షార్ట్ ఫిలిమ్స్ ని చుసిన విక్రమ్ వెంటనే అతనితో మాట్లాడి సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. రెండు మూడు రోజుల అనంతరం అతని పనితనం చూసి అందరూ థ్రిల్ అయినట్లు నాని వివరణ ఇచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే