
చరిత్ర పుటల్లో తమకంటూ ఓ క్రేజ్ ఏర్పరుచుకున్న రియల్ లైఫ్ కింగ్స్ ఎంతోమంది. అలాంటి వారిలో మరాఠా చక్రవర్తి శివాజీ ఒకరు. ఛత్రపతి బిరుదు సంపాదించుకున్న పరాక్రమశాలి శివాజీ జీవితం ఆధారంగా సీనియర్ ఎన్.టి.ఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్లు కూడా సినిమా చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు. వారు చేయకున్నా శివాజి కథ మహేష్ తో చేస్తే అదిరిపోద్దని అంటున్నాడు పరుచూరి సోదరులలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ.
పరుచూరి పలుకులు యూట్యూబ్ చానెల్ లో పెట్టిన సౌండ్ బైట్ వీడియోలో..మహేశ్ బాబు గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. ఇటీవల సినిమా పరిశ్రమలో పలు క్రేజీ కాంబినేషన్స్ మీద ఆయన మాట్లాడుతున్నారు. అందులో భాగంగా మహేష్ బాబు గురించి మాట్లాడారు. ఇక మహేష్ ను శివాజిగా చూపించే సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్.టి.ఆర్, కృష్ణ చేయలేని ఆ ప్రాజెక్ట్ మహేష్ చేస్తే బాగుంటుందని గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
ఇక చాలా కాలంగా మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోకి కె.ఎల్.నారాయణ ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నాడట. మరి రాజమౌళి పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్టుగా ఛత్రపతి శివాజి ప్రాజెక్ట్ మహేష్ తో చేస్తాడేమో చూడాలి.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు.. భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రాజమౌళి సినిమానే ఉంటుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమన్నది చూడాలి. మొత్తానికి ఛత్రపతి శివాజిగా మహేష్ చేస్తే మాత్రం అది రికార్డులు బద్ధలు కొట్టడం మాత్రం ఖాయం.