కన్నడ నాట శృతీహాసన్ కు ఘోర అవమానం

First Published Oct 11, 2017, 4:53 PM IST
Highlights
  • సంగమిత్ర నుంచి తప్పుకున్నాక మరే ప్రాజెక్టూ సైన్ చేయని శృతి హాసన్
  • శృతీ హాసన్ కన్నడ సినిమాలో నటిస్తోందంటూ గత కొంతత కాలంగా వార్తలు
  • అలాంటిదేమీ లేదని శృతీ ట్వీట్ చేయటంతో విరుచుకుపడ్డ కన్నడ నటుడు జగ్గేష్
  • శృతీ హాసన్ తమ సినిమాలో నటిస్తోందంటూ ప్రకటించి భంగపడ్డ జగ్గేష్ అండ్ టీమ్

కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో పెద్దగా విజయాలు సాధించకున్నా.. తెలుగులో పవన్ కల్యాణ్ తో నటించిన ‘గబ్బర్ సింగ్’  సూపర్ హిట్ అయ్యాక హిట్ హీరోయిన్ గా అవతారమెతత్తింది.  అప్పటి నుంచి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుసగా ఆఫర్లు కొట్టేస్తూ విజయాలు సొంతం చేసుకున్న శృతి హాసన్ కు ఎందుకో గత కొంత కాలంగా సినిమాలు లేకుండా పోయాయి. 

 

ఈ నేపథ్యంలో తాజాగా శృతి హాసన్ ని ఓ కన్నడ హీరో ఘోరంగా అవమానించాడు.  శ్రుతి హాసన్ అసలు అందంగా ఉండదని , మేకప్ తీసేస్తే ఆమెని చూసి జడుసుకోవడం ఖాయమని అంత చండాలంగా ఉంటుందని, ఆమెని మించిన అందగత్తెలు కర్ణాటకలో చాలామంది ఉన్నారని.. అలాంటి వారికి చాన్స్ లు ఇవ్వకుండా శృతి లాంటి గర్విష్టి వెంట దర్శక, నిర్మాతలు పడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు కన్నడ హీరో జగ్గేష్.

 

అయితే మనోడు ఈ రేంజిలో రెచ్చిపోవడానికి కారణం లేకపోలేదు లెండి. ఈ మధ్య ఓ  కన్నడ సినిమాలో శ్రుతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ శృతి హాసన్ మాత్రం నేను ఏ కన్నడ సినిమాలో కూడా నటించడం లేదు అంటూ ట్వీట్ చేయడంతో దాన్ని అవమానంగా ఫీల్ అయ్యారు. 

 

శ్రుతి హాసన్ ట్వీట్ తో రగిలిపోయిన జగ్గేష్... అసలు శ్రుతిని మించిన అందగత్తెలు కర్ణాటక లో చాలామంది ఉన్నారని... అసలు శ్రుతి ని మేకప్ లేకుండా చూడలేమని ఘోరంగా అవమానించాడు జగ్గేష్.  మరి ఇప్పటికే సినిమాలు చేతిలో లేక సంగమిత్ర కూడా వదిలేసి ఖాళీగా వున్న శృతి ఏం రిప్లై ఇస్తుందో చూడాలి.

 

click me!