బ్రహ్మానందం లీడ్ రోల్ లో "కత్తి రెడ్డి"

Published : Jul 03, 2017, 08:52 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
బ్రహ్మానందం లీడ్ రోల్ లో "కత్తి రెడ్డి"

సారాంశం

మళ్లీ హీరోగా మారబోతున్న బ్రహ్మానందం కత్తి రెడ్డి అనే సినిమాలో లీడ్ రోల్ లో బ్రహ్మి గతంలో బ్రహ్మి నటించిన ఖాన్ దాదా తరహాలో ఈ పాత్ర

”కత్తి రెడ్డి ” టైటిల్ వినగానే షాక్ అవుతున్నారా ? ఈ కత్తి రెడ్డి .. ఎవరు ? ఏమా కథ అంటే .. టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం లీడ్ రోల్ లో నటించే సినిమా ! ”కత్తి రెడ్డి” .. ‘ఎత్తితే .. దించడు’ అనేది ట్యాగ్ లైన్ ? బ్రహ్మానందం లీడ్ రోల్ పోషించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఖాన్ దాదా లాంటి తరహా లో ఈ పాత్ర సాగుతుందట. పూర్తీ స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో కీ రోల్ లో రచ్చ రవి నటిస్తున్నాడు. వి రవివర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

 

ఈ మధ్య బ్రహ్మానందం క్రేజ్ బాగా తగ్గిందనే టాక్ వుంది. ఒకప్పుడు బ్రహ్మానందం ఉంటేనే సినిమా చేస్తానని చెప్పిన హీరోలు ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం లేకుండానే చాలా సినిమాలు వస్తున్నాయి. సినిమాలో మళ్ళీ తన హవా చాటుకోవడానికి బ్రహ్మానందం ప్రయత్నాలు మొదలు పెట్టాడు,  ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఓకే చెప్పాడు. సో ఈ కత్తి రెడ్డి చేసే హంగామా ఏమిటో చూడాలి !! త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన