కాస్టింగ్ కౌచ్, సహజీవనం అనేది పూర్తిగా వ్యక్తిగతం-గౌతమి సంచలన కమెంట్స్

Published : Jul 03, 2017, 07:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
కాస్టింగ్ కౌచ్, సహజీవనం అనేది పూర్తిగా వ్యక్తిగతం-గౌతమి సంచలన కమెంట్స్

సారాంశం

కొన్ని రోజుల క్రితమే కమల్ హాసన్ తో విడిపోతున్నట్టు ప్రకటించిన గౌతమి గౌతమి నిర్ణయం పట్ల ఇప్పటికీ ఎలాంటి కమెంట్ చేయని కమల్ హాసన్ తాజాగా సహజీవనం, కాస్టింగ్ కౌచ్ పై గౌతమి సెన్సేషనల్ కమెంట్స్

తెలుగు, తమిళనాట నటి గౌతమి అంటే తెలియని వారుండరు. ఎయిటీస్-నైంటీస్ లో గౌతమి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తార. ఆంధ్రలోని నిడదవోలులో తెలుగు కుటుంబంలో పుట్టిన గౌతమి.. తెలుగమ్మాయే అయినా సినిమా రంగంలో తమిళ ఇండస్ట్రీలో సెటిలైంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు  వెల్లడించారు.

 

సౌత్ సినిమా పరిశ్రమ మొత్తం చెన్నైలో ఉన్నపుడే తాను సినిమాల్లోకి ఎంటరయ్యానని, తాను నటిగా నిలదొక్కుకున్న నాలుగైదు సంవత్సరాల తర్వాత తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కు మారిందని, తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదని.. ఆ సమయంలో తమిళ సినిమా పరిశ్రమలో ఎక్కువ అవకాశాలు ఉండటంతో అటు వైపే స్థిరపడాల్సి వచ్చిందని గౌతమి చెప్పారు.

 

ఇక శృతి హాసన్‌తో తనకు గొడవలేమీ లేవని, అలాంటి వార్తల్లో నిజం లేదని తెలిపారు. నా వయసుకు, శృతి హాసన్ వయసుకు చాలా తేడా ఉంటుంది, మేము పెద్దలం, వారు పిల్లలు వారితో గొడవపడే విషయాలు ఏముంటాయని గౌతమి వ్యాఖ్యానించారు.

 

ఇక కమల్ తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. నేనూ, కమల్ హాసన్ 13 ఏళ్లు కలిసి(సహజీవనం) జీవించిన తర్వాత నా జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయం కమల్ తో విడిపోవడమేనని గౌతమి స్పష్టం చేశారు. తాము తిరిగి కలుసుకోలేనంతగా దారులు వేరయ్యాయని అర్థమయ్యాక రాజీ పడి జీవించడం, అదీ కన్న కలల్ని త్యాగం చేసి, నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. వాస్తవాన్ని అంగీరించి ముందుకు సాగాలి. గుండె పగిలే ఈ నిజాన్ని అంగీకరించడానికి, ఈ నిర్ణయం తీసుకోవడానికి దాదాపు రెండేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. దీని నుంచి సానుభూతి పొందాలనేది గానీ, ఒకర్ని తప్పుపట్టాలనేది గానీ నా ఉద్దేశం కాదు. మార్పు అనేది ఆహ్వానించదగిందనేది, ప్రతి వ్యక్తిలో మార్పును మానవ స్వభావం నిర్ణయిస్తుందనేది నేను నా జీవితంలో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. ఈ మార్పులన్నీ మనం ఊహించేవి, అంచనా వేసేవి కాకపోవచ్చు, ఏమైనా, ఓ సంబంధంలో ఈ విభేదాల ప్రభావాన్ని కాదనలేం. జీవితంలోని ఈ దశలో నా అంతట నేనుగా బహుశా ఈ నిర్ణయాన్ని ముందు పెట్టాల్సిన పరిస్థితి రావడం బాధాకరం, ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదు గానీ నాకు ఇది అవసరంగా మారిందని గౌతమి మరోసారి స్పష్టం చేశారు.

 

సాంప్రదాయానికి వ్యతిరేకం, అనుకూలం అనేదేమీ లేదు. ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్. ఇలా ఉండాలనుకునే వారిని అలా ఉండే వారు వ్యతిరేకం అంటారు. అలాగ ఉండాలి అనుకునే వారిని ఇలాగ ఉండే వారు వ్యతిరేకం అంటారు. రిలేషన్ షిపప్ ఏదైనా సరే.. మ్యారేజ్, ఒక కమిటెడ్ రిలేషన్ షిప్ మాత్రమే కాక.. టీచర్-స్టూడెంట్, సిస్టర్-బ్రదర్, పేరెంట్-చైల్డ్... ఫ్రెండ్స్, కొలీగ్స్.. ఏ రిలేషన్ షిప్ తీసుకున్నా కమిట్మెంట్ ఇంపార్టెంట్. మ్యూచువల్ రెస్పెక్ట్ అంతకన్నా ఇంపార్టెంట్. ఒకరినొకరు గౌరవించి ఒక రిలేషన్ షిప్ లోకి మీరు ఎంటరవ్వండి, అది ఎక్కడికో వెలుతుంది. ఎంతో కాలం నిలుస్తుంది. దానికి మీరు ఏ పేరు పెట్టినా నాకు అభ్యంతరం లేదు అని సహజీవనం గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు గౌతమి.

కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన గౌతమి అది వారివారి వ్యక్తిగత అభిప్రాయమని కుండబద్దలు కొట్టారు గౌతమి. కాస్టింగ్ కౌచ్ అంటే అర్థం అందరికీ తెలుసు. ఇలాంటి ఒక ఇన్సెంటివ్‌తో ఒక పని జరగడం, జరిపించడం అనేది ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాక, ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. అయితే ఎంత వరకు అది మన లైఫ్‌ను టచ్ చేయడానికి మనం ఒప్పుకుంటాం, పర్మిషన్ ఇస్తామన్నది ముఖ్యం. ఇట్స్ యువర్ డెసిషన్. కాంప్రమైజ్ అనేది కేవలం కాంస్టింగ్ కౌచ్ విషయంలోనే కాదు. కొన్ని పనులు జరగాలని మనం ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ అవుతాం. కొన్ని రిలేషన్ షిప్స్ వర్కౌట్ అవ్వాలని పర్సనల్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ అవతాం. కొన్ని పనులు వేగంగా జరగాలని క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ అడ్జెస్ట్ అవుతాం. ఇలాంటి అడ్జెస్ట్మెంట్ అనేది మన పర్సనల్ డెసిషన్. ఆ పని చేస్తామా లేదా అనేది మన వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చేస్తే ఎలా చేస్తాం? చేయకపోతే ఎందుకు చేయం. దాని వల్ల జరిగే పరిణామాలను అంగీకరించడానికి మనం రెడీగా ఉన్నామా? ఇవన్నీ చాలా పర్సనల్ డెసిషన్స్... అంటూ కాస్టింగ్ కౌచ్ మీద గౌతమి లెక్చర్ ఇచ్చారు.

 

ఇక కాన్సర్ ఎదుర్కోవడానికి ఇన్స్‌పిరేషన్ ఎవరూ లేరు....కేవలం నా కామన్ సెన్స్. నాకు బిగ్గెస్ట్ హెల్ప్ కామన్ సెన్స్. సెల్ప్ ఎగ్జామినేషన్లో నేనే ముందు క్యాన్సర్ లంప్ కనిపెట్టాను. 30 సంవత్సరాల దాటిన తర్వాత రెగ్యులర్ గా సెల్ఫ్ చెక్ చేసుకున్నాను. ధైర్యంగా ట్రీట్మెంట్ చేయించుకున్నా అని గౌతమి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్