కార్తికేయ తరువాత తమిళ స్టార్ హీరో అజిత్ తో.. స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న మరో తెలుగు నటుడు

Published : Jul 28, 2022, 11:41 AM IST
కార్తికేయ తరువాత తమిళ స్టార్ హీరో అజిత్  తో.. స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న మరో తెలుగు నటుడు

సారాంశం

తమిళ సినిమాల్లో వరుసగా తెలుగు స్టార్స్ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరో అజిత్ సినిమాల్లో పక్కాగా తెలుగు వారిని తీసుకుంటున్నాడు. ఆమధ్య వాలిమైలో యంగ్ హీరో కార్తికేయ కీ రోల్ చేయగా.. ఇప్పుడు అజయ్ అజిత్ సినిమలో సందడి చేయబోతున్నాడు.   

వరుస సినిమాలు వరుసగా సూపర్ హిట్స్ తో సీనియర్ హీరోలలో సక్సెస్ రేటు లో ముందు ఉన్నాడు  కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం ఓ యాక్షన్ మూవీ చేస్తుననాడు అజిత్. ఈసినిమా  అజిత్ 61వ    సినిమాగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా విశేషం ఏంటీ అంటే.. అజిత్ తో వరుసగా రెండు సినిమాలు చేసిన హెచ్ వినోద్ ఈసినిమాకు కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే వీరి కాంబినేషన్ లో వరుసగా హ్యాట్రిక్ పడినట్టే. 

 సినిమా తో మరోసారి యాక్షన్ థ్రిల్లర్ గా అభిమానుల్ని అలరించబోతున్నాడు అజిత్. ఇందులో అజిత్ మేకోవర్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా...  వలిమై రిలీజ్ అయిన  కొద్దిరోజులకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. అజిత్ 61 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాలో మరో తెలుగు నటుడు సందడి చేయబోతున్నాడు.  

అజిత్ 61 ఈ సినిమాలో తెలుగు నటుడు అజయ్  కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన అజయ్.. అజిత్ తో స్క్రీన్  షేర్ చేసుకుంటూండడం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. పుణేలో జరగబోయే నెక్స్ట్ షెడ్యూల్ లో అజయ్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమాలో  మంజు వారియర్ , జాన్  కొక్కెన్ , వీర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. వీరంతా  పూణే షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు

అయితే అజత్ రీసెంట్ మూవీ వాలిమై లో కూడా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ మెయిన్ విలన్ గా నటించి మెప్పించాడు. తెలుగులో పెద్దగా ఆడకపోయినా.. తమిళంలో మాత్రం కార్తికేయకు మంచి ఇమేజ్ వచ్చిందీ సినిమాతో. ఇక ఇప్పుడు అజిత్ సినిమాలో అజయ్ పాత్ర కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చెబుతున్నారు. పూణే తరువాత   గోవా  షెడ్యూల్‌ జరగబోతోంది. ఈ షూటింగ్ తో  దాదాపు సినిమా షూటింగ్ కంప్లీట్ కాబోతోంది. టైటల్ కూడా త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.  బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్