
హైదరాబాద్ సరూర్‌నగర్ వి.ఎం.హోంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్‌ను స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు. విద్యార్ధులకు తరగతులు జరుగుతున్న వేళ షూటింగ్‌లకు ఏ విధంగా అనుమతిస్తారని ఆకుల శ్రీవాణి ప్రశ్నించింది. అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో డీఆర్వో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా వైజాగ్ షెడ్యూల్‌లో చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
సరూర్‌నగరల్‌లో విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో షూటింగ్ చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ షూటింగ్‌ను కార్పొరేటర్ అడ్డుకున్నారు. స్కూళ్లు నడుస్తున్న సమయంలో షూటింగ్‌కు ఎలా అనుమతి ఇఛ్చారని... బీజేపీకార్పొరేటర్ శ్రీవాణి సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. పిల్లల క్లాసులకు ఇబ్బందులు తలెత్తుతాయంటూ ఆమె ఆరోపించారు. దీంతో సినిమా టీం.. షూటింగ్ నిలిపివేసి.. అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వటంతో డీఆర్వో ఇలా ఆర్డర్ ఇచ్చారు.
ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్ వినిపించాయి. తాజాగా ‘అధికారి’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. చరణ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ టైటిల్‌కి పాన్ ఇండియా అప్పీల్ కూడా ఉంటుందని భావిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌కి పూర్తవుతుందని టాక్.