
దాదాపు 17 ఏళ్ళ క్రితం రిలీజ్ అయ్యి.. థియేటర్లను అల్లాడించింది చంద్రముఖీ సినిమా. రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా జ్యోతిక, ప్రభు కీ రోల్స్ చేసిన సినిమా ఇది. వాసు డైరెక్ట్ చేసిన చంద్రముఖి సంచలన విజయాన్ని సాధించింది. ఇక ఇన్ని ఏళ్ళకు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 ను తెరకెక్కిస్తున్నాడు వాసు. అయితే ఈసారి మాత్రం హీరోగా రజనీ కాంత్ కు బదులు లారెన్స్ హీరోగా సినిమా తెరకెక్కబోతోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ నెల 15వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం మైసూర్ లో సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి అందుతున్న కీలక అప్ డేట్ ఏంటీ అంటే.. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు రాఘవా లారెన్స్ సరసన సందడి చేయనున్నారు. లక్ష్మి మీనన్ ,మంజిమా మోహన్ , మహిమ నంబియార్, సృష్టి దాంగే తో పాటు సుభిక్ష కృష్ణన్ నటిస్తున్నారు. ఇక వీరు సెట్ లో కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది.
అయితే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసే అంశం ఏంటీ అంటే.. ఈ ఐదుగురు హీరోయిన్లలో అసలు చంద్రముఖి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గతంలో చంద్రముఖి సినిమాలో ఆ పాత్రను జ్యోతిక పర్పెక్ట్ గా పెర్ఫామ్ చేసింది. ఇక ఈసారి ఆ రేంజ్ లో నటించగల నాయక ఎవరు అనేది ఆసక్తి కరంగా మారింది. అయితే మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని సీక్రేట్ గానే ఉంచుతున్నారు.
అసలు ఈ సినిమా రజనీకాంత్ తోనే చేయాలని డైరెక్టర్ వాసు అనుకున్నారట. కాని తలైవా ఈ సినిమా చేయడానికి విముఖత వ్యక్తం చేయడంతో.. రజనీకాంత్ నుంచి పర్మీషన్ తీసుకుని మరీ రాఘవా లారెన్స్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇకలైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.