కల్లు గొప్పతనం చెప్పారు.. అఖండ డైరెక్టర్ ని కలిసిన గౌడ సంఘాలు

By team teluguFirst Published Dec 8, 2021, 10:00 AM IST
Highlights


బాలయ్య (Balakrishna) అఖండ విజయఢంకా మోగిస్తోంది. రికార్డు వసూళ్ళ దిశగా దూసుకెళ్తున్న అఖండ బాలయ్యకు గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చింది. కాగా ఈ మూవీలోని ఓ సన్నివేశానికి గౌడ సామాజిక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తమ వృత్తిని గొప్పగా చిత్రీకరించిన దర్శకుడు బోయపాటిని సంఘ పెద్దలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

అఖండ (Akhanda)మూవీలో ఓ సన్నివేశంలో బాలకృష్ణ కల్లు తాగుతారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాలయ్య చేత కల్లు  తాగిస్తుంది. అదే సమయంలో సహజంగా దొరికే మత్తుపానీయం కల్లు ప్రయోజనాల గురించి గొప్పగా వర్ణిస్తుంది. ‘కల్లు అనేది మా సంస్కృతిలో ఓ భాగం. ఇది మందు కాదు.. మెడిసిన్‌. ఇది తీసుకుంటే బాడీ సాఫ్‌ అయితది, దిమాక్‌ కూల్‌ అయితది’ అంటూ చెబుతుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన కల్లు, దానిని తాడి చెట్ల నుండి ఒడిసిపట్టే గీత కార్మికుల గురించి ఈ సినిమాలో చెప్పడం గొప్ప విషయమని చెప్పాలి. 


బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాలో ఓ కులవృతి ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పడం.. వాళ్ళ సామాజిక వర్గ అభివృద్ధికి దోహదం చేసే అంశం. దానికి కృతజ్ఞతగా తెలంగాణ గౌడ సంఘం నాయకులు అఖండ మూవీ డైరెక్టర్ బోయపాటిని స్వయంగా కలిశారు. శాలువా, పుష్ప గుచ్చంతో ఆయనను సత్కరించారు. 


మరోవైపు అఖండ వసూళ్ల వరద పారిస్తుంది. ఐదు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అఖండ రూ. 41.14 షేర్, 64.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ వసూళ్లలో డెభై శాతం వరకు ఆంధ్రా నుండి దక్కినవే. దాదాపు రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అఖండ వీకెండ్ ముగిసే నాటికే బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. బాక్సాఫీస్ వద్ద అఖండకు పోటీ కూడా లేని నేపథ్యంలో ఈ మూవీ భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 
తాజా గణాంకాలు పరిశీలిస్తే ఏపీలో టికెట్స్ ధరల ప్రభావం అఖండ మూవీపై చూపించలేదని అర్థం అవుతుంది. ఈ పరిణామం విడుదలకు సిద్ధంగా ఉన్న.. పుష్ప, ఆర్ ఆర్ ఆర్ , రాధే శ్యామ్ వంటి భారీ చిత్రాల నిర్మాతలలో ధైర్యం నింపింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తరుణంలో టికెట్స్ ధరల తగ్గింపు వలన జరిగే నష్టం ఏమీ లేదని స్పష్టమైంది. 
ఇక బాలయ్య కెరీర్ లో రికార్డు వసూళ్ల దిశగా అఖండ వెళుతుంది. 

Also read Akhanda:‘అఖండ’కు సీక్వెల్‌ , అవన్నీ చూపిస్తారట,వాళ్లలో భయం

అఖండ బాలయ్యను వందల కోట్ల క్లబ్ లో చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా అఖండ రూ. 80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్ సీస్ లో బాలయ్య సినిమాలకు అంతగా మార్కెట్ ఉండదు. పుష్ప మాత్రం నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో దుమ్మురేపుతోంది. 

Also read అల్లు అర్జున్ వలె చిరు, పవన్ చేయగలరా... మెగా ఫ్యామిలీలో వర్మ చిచ్చు
 

click me!