అనసూయ కారును చుట్టుముట్టిన కుర్రాళ్ళు... టైట్ సెక్యూరిటీ మధ్య!

Published : May 30, 2023, 01:13 PM IST
అనసూయ కారును చుట్టుముట్టిన కుర్రాళ్ళు... టైట్ సెక్యూరిటీ మధ్య!

సారాంశం

నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆమె పబ్లిక్ లో కనిపిస్తే చాలు కుర్రాళ్ళు ఎగబడుతున్నారు. 

అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. అలాగే ప్రమోషన్స్ ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. తాజాగా అనసూయ కోదాడ వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ షాప్ ఓపెనింగ్ లో ఆమె పాల్గొన్నారు. అనసూయ రాకను తెలుసుకున్న యువత పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అనసూయ కారును చుట్టుముట్టారు. సెక్యూరిటీ మధ్య ఆమెను వేదికపైకి తీసుకెళ్లారు. ఇక అనసూయ మాట్లాడుతుంటే జనాలు ఈలలు వేస్తూ గోల చేశారు. ఉత్సాహం ప్రదర్శించారు. 

అనసూయ రాకతో కోదాడ నగరం సందడిగా మారిపోయింది. అనసూయ ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ విమానం. అనసూయ వేశ్య పాత్ర చేశారు. స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేస్తూ జీవనం సాగించే ఒంటరి స్త్రీగా ఆమె పాత్ర ఉంది. ఇలాంటి సాహసోపేతమైన పాత్ర చేయాలంటే గట్స్ ఉండాలి. అనసూయ అందరిలాంటి యాక్ట్రెస్ కాదని నిరూపించుకుంది. 

అలాగే పుష్ప 2 లో దాక్షాయణిగా నటిస్తుంది. ఇది నెగిటివ్ రోల్. డీ గ్లామర్ లుక్ లో అనసూయ షాక్ ఇచ్చారు. పార్ట్ 2లో సునీల్, అనసూయ పాత్రలను దర్శకుడు సుకుమార్ ఎలా ముగించారో చూడాలి. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా పుష్ప 2 విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. ఇండియా వైడ్ పుష్ప 2 పై అంచనాలు ఉన్నాయి. 

ఇటీవల అనసూయ హీరో విజయ్ దేవరకొండతో గొడవకు దిగారు. ఆయన్ని పరోక్షంగా తన ట్వీట్ తో అనసూయ టార్గెట్ చేసింది. విజయ్ దేవరకొండ నేమ్ ముందు The అని పెట్టడాన్ని ఆమె తప్పు బట్టారు. పైత్యం బాగా ఎక్కువైందని ట్వీట్ లో కామెంట్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. ఎంతగా ట్రోల్ చేసినా నేను తగ్గేది లేదని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో కూడా విజయ్ దేవరకొండతో ఆమె కొన్ని విషయాల్లో విభేదించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?