'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. టెన్షన్ లో చంద్రబాబు!

Published : Mar 01, 2019, 10:47 AM ISTUpdated : Mar 01, 2019, 10:48 AM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. టెన్షన్ లో చంద్రబాబు!

సారాంశం

తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టెన్షన్ మొదలైంది. ఈ సినిమా మార్చి 22న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఈ సినిమాను అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టెన్షన్ మొదలైంది. ఈ సినిమా మార్చి 22న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఈ సినిమాను అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కొందరు టీడీపీ నేతలు కోర్టుకి వెళ్లి ప్రయత్నించినా.. సినిమాను ఆపలేకపోవడంతో ఇప్పుడు తమ అధికారాన్ని వాడి సినిమా విడుదల ఆపాలని చూస్తున్నారు.

చంద్రబాబుకి కూడా సినిమా విడుదల కావడం ఇష్టం లేదు. కాబట్టి వర్మపై విరుచుకుపడడానికి టీడీపీ సిద్ధంగా ఉంటుంది. ముందుగా సినిమాకి సెన్సార్ సమస్యలు సృష్టించి విడుదల వాయిదా పడేలా చేయాలని వ్యాహం రచించినట్లు తెలుస్తోంది. అది కుదరకపోతే విడుదల రోజు థియేటర్ల ముందు నిరసలు చేయడం వంటి పనులు చేయాలని చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. ప్రేక్షకుల్లో ఈ సినిమా చూడాలనే ఆసక్తి పెరిగిపోతోంది. సినిమా ట్రైలర్, పాటలు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. క్రిష్ రూపొందించిన 'ఎన్టీఆర్ బయోపిక్' ఫ్లాప్ కావడంతో అది కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కి కలిసొస్తోంది. టీడీపీ వ్యతిరేకులంతా.. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ కొడుకులతో కలిసి చంద్రబాబు ఏ విధంగా ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారో ఈ సినిమా వివరంగా చూపించబోతున్నాడు వర్మ. ఈ సినిమా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే టెన్షన్ కూడా చంద్రబాబుకి ఉన్నట్లు సమాచారం.  

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు