దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా: రాఖీ సావంత్

By Udaya DFirst Published Mar 1, 2019, 9:57 AM IST
Highlights

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపధ్యంలో దేశం కోసం అవసరమైతే తాను ప్రాణత్యాగానికి వెనుకాడనని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అన్నారు. 

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపధ్యంలో దేశం కోసం అవసరమైతే తాను ప్రాణత్యాగానికి వెనుకాడనని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తరువాత భారత్ చేపట్టిన చర్యలను సమర్ధిస్తూ ప్రధాని నరేంద్రమోడీకి తన మద్దతు తెలిపింది రాఖీ సావంత్.

పుల్వామా దాడి తరువాత పాక్ కి దీటుగా బదులిచ్చేందుకు ప్రధాన నరేంద్రమోడీ తీసుకున్న చర్యలన్నీ సరైనవేనని రాఖీ సావంత్ వెల్లడించింది. దేశం కోసం చనిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను శత్రు శిబిరాల్లోకి 50 నుండి 100 బాంబులు తీసుకెళతానని, అవసరమైతే వారిని మట్టుబెట్టి వస్తానని చెప్పుకొచ్చారు.

పుల్వామా దాడికి మోడీజీ సరైన సమాధానం ఇచ్చారు. పాక్ కస్టడీలో ఉన్న పైలట్లు సురక్షితంగా తిరిగి దేశానికి చేరుకోవాలని తాను ప్రార్దిస్తున్నట్లు చెప్పారు. పంజాబ్ లోని లుథియానాలో  ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాఖీ ఈ వ్యాఖ్యలు చేసింది. 
 

click me!