'118' మూవీ ట్విట్టర్ రివ్యూ!

Published : Mar 01, 2019, 10:14 AM IST
'118'  మూవీ ట్విట్టర్ రివ్యూ!

సారాంశం

గతేడాది 'నా నువ్వే' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. తాజాగా మరోసారి '118' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

గతేడాది 'నా నువ్వే' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. తాజాగా మరోసారి '118' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వం వహించారు.

నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హక్కులు దిల్ రాజు సొంతం చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనే విడుదల చేశారు.  ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

కానీ ప్రీరిలీజ్ బజ్ మాత్రం పెద్దగా లేకపోవడంతో కాస్త డల్ గా అనిపించింది. కానీ ఇప్పుడు సినిమా ప్రీమియర్ షో చూసిన వాళ్లు మాత్రం సినిమా బాగుందని  అంటున్నారు. నందమూరి అభిమానులతో పాటు కొందరు నెటిజన్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. కళ్యాణ్ రామ్, నివేదా థామస్ ల నటన చాలా బాగుందని అంటున్నారు.

సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ అధ్బుతంగా ఉన్నాయని అంటున్నారు. శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం, గుహన్ సినిమాటోగ్రఫీ  సినిమా స్థాయిని పెంచాయని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడినట్లే ఉంది. 

 

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు