RRR Release Secret: ట్రిపుల్ ఆర్ జనవరి 7న రిలీజ్ అవుతుందా..? రాజమౌళి తనకు సీక్రేట్ గా చెప్పారన్న తరణ్ ఆదర్శ్

By Mahesh Jujjuri  |  First Published Dec 29, 2021, 2:35 PM IST

ట్రిపుల్ ఆర్ రిలీజ్ గురించి సీక్రెట్ చెప్పారు ప్రముఖ సినిమా విశ్లేషకులు తరణ్ ఆదర్శ్. ట్రిపుల్ ఆర్ గురించి ఆయనతో మాట్లాడానంటూ.. రాజమౌళితో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు మూవీ క్రిటిక్.


ట్రిపుల్ ఆర్ 500 కోట్ల బడ్జెట్.. టాలీవుడ్ బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్.. మూడేళ్ళ కష్టం. ఇప్పటికే కోవిడ్ వల్ల రెండు సార్లు పోస్ట్ పోన్ అయ్యింది మూవీ. ఫైనల్ గా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్  చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్నారు. ఈవెంట్స్ తో సందడి చేస్తున్నారు. మరి ఈ టైమ్ లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ సాధ్యపడకపోతే పరిస్థితి ఏంటి..?అదేంటి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వదు అని ఎవరు చెప్పారు..?

భారత్ లో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజు రోజు కి కేసులు పెరుగుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రాలలో ఇప్పటికే ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కొన్ని రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ.. థియేటర్లు మూత పడటం, ఆక్యూపెన్సీ తగ్గించడం, ఇలా చాలా రకాలు ప్రాబ్లమ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ‌, కేరళ, కర్ణాటక, త‌మిళ‌నాడు, ఏపీల్లోనూ క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం, ప‌లు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడుతుండడంతో సినిమా విడుద‌ల విష‌యంలో ట్రిపుల్ ఆర్ టీమ్ ఆలోచనలో పడిందని ప్రచారం జరుగుతుంది.

Latest Videos

ట్రిపుల్ ఆర్ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ సినిమా విశ్లేషకులు తరణ్ ఆదర్శ్. ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా పడే అవకాశం లేనే లేదన్నారు. ఈ విషయాన్ని స్వయంగా గ్రేడ్ డైరెక్టర్ రాజమౌళి తనతో చెప్పారన్నారు తరణ్. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ టైమ్ లో జక్కనను కలిసిన తరణ్.. ఆయనతో కలిసి దిగిన ఫోటోను శేర్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ట్రిపుల్ ఆర్ ను జనవరి 7న రిలీజ్ చేస్తామంటూ.. రాజమౌళి తనకు చెప్పినట్టు తరణ్ వెల్లడించారు.

... BREAKING NEWS... 'RRR' VERY MUCH ON 7 JAN 2022... SS RAJAMOULI OFFICIAL STATEMENT TO ME... No postponement. pic.twitter.com/DmHdvp986U

 

అంతా బాగానే ఉంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ పై పట్టుదలతో ఉన్నారు రాజమౌళీ అండ్ టీమ్. కాని నెక్ట్స్ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబేషన్స్ మీద, సంక్రాంతి సెలబ్రేషన్స్ మీద ఆంక్షలు తప్పవు అన్నట్లు సిగ్నల్స్ వస్తున్నాయి. మరి థియేటర్స్ కు మాత్రమే స్పెషల్ పర్మీషన్లు ఇవ్వురు కదా..? ఆ పరిస్థితి వస్తే ఏంటి ప్రత్యామ్నాయం.. రిలీజ్ డేట్ మార్చుకోక తప్పదా..? ఇన్ని ప్రశ్నలు బయటకు వస్తున్నాయి.

ట్రిపుల్ ఆర్ పరిస్థితే ఇలా ఉంటే.. ఆ తరువాత ఆశగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్, ఆచార్య, భీమ్లానాయక్.. సర్కారువారి పాట, లైగర్ ఇలా చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. అలా ఏం కాదులే అని ధైర్యంగా ఉంటుంన్నా... సినిమా పెద్దలను మాత్రం.. థర్డ్ వేవ్ భయం నీడలా వెంటాడుతుంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.

Also Read ;RRR Promotions: ట్రిపుల్ ఆర్ కు కొత్త పేరు పెట్టిన కపిల్ శర్మ.. రాజమౌళి ఏమన్నాడంటే..?

దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో.. పాన్ ఇండియా రేంజ్ తో తెరకెక్కింది ట్రిపుల్ ఆర్ సినిమా. రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ సీతారామ రాజుగా.. ఎన్టీఆర్ కొమురం  భీమ్ గా .. ఆలియా భాట్ సీతగా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ , శ్రీయ ప్రత్యేక పాత్రల్లో నటించారు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. 

Also Read ;RRR-Radheshyam: ముంచుకొస్తున్న ముప్పు.. వందల కోట్లు వదులుకోవాల్సిందేనా? రాజమౌళి, ప్రభాస్‌లో గుబులు ?

click me!