Samantha : నిన్ను మాత్రమే నమ్ముతా.. స్టార్ హీరో గురించి సమంత ఎమోషనల్ పోస్ట్.

By Mahesh Jujjuri  |  First Published Dec 29, 2021, 12:44 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన గురించి పుష్ప థ్యాంక్ యూ మీట్ లో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన అల్లు అర్జున్ గురించి అంతే ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది సామ్.


సమంత(Samantha) ఏ ఎమోషన్ అయినా దాచుకోదు. సోషల్ మీడియాలో చెప్పేస్తుంది. ప్రేమ అయినా బాధ అయినా తన పోస్ట్ ద్వారా అర్ధం అయ్యేట్టు చెప్పేస్తుంది. ఇప్పుడు అలాంటి పోస్ట్ ఒకటి శేర్ చేసింది సమంత. కాని ఈ పోస్ట్ బాధతో పెట్టింది కాదు. సంతోషంతో థ్యాంక్స్ చెపుతూ పెట్టింది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది సమంత. జీవితాంతం తనను నమ్ముతాను అంటోంది. ఇంతకీ ఇంత ఎమోషనల్ పోస్ట్ Samantha ఎందుకు పెట్టింది.

రీసెంట్ గా పుష్ప థాంక్యూ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ లో అందరూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా బన్నీ,సుకుమార్ అయితే ఫీలింగ్స్ తట్టుకోలేక  ఏడ్చేశారు కూడా. ఈ సందర్భంలో అల్లు అర్జున్(Allu Arjun) సమంతను తలుచుకున్నారు.స్పెషల్ సాంగ్ చేసినందుకు సమంతకు థ్యాంక్స్ చెప్పారు. సడెన్ గా సాంగ్ చేయమంటే వెంటనే ఒప్పేసుకుని చేశారు. ఈ పాటను మీరు ఎంత నమ్మారో కాని... మేము మిమ్మల్ని నమ్ముతున్నామని.. మీరు మమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకానికి థ్యాంక్స్. మీకు ఎన్ని అనుమానాలు వచ్చినా.. నేను చెప్పిన మాటను నమ్మి.. నా మీద నమ్మకంతో.. మరో మాట మాట్లాడకుండా సాంగ్ చేశావ్. అది నా గుండెను తాకింది. మీ మీద నాకు గౌరవం పెరిగింది అన్నారు బన్ని. ఇంత కష్టపడ్డందకు ఈ సాంగ్ ఇప్పుడు నెంబర్ వన్ అయ్యింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అని సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు బన్ని.

And now I will always trust you 🙌🙇‍♀️ https://t.co/EQOGv6M10F

— Samantha (@Samanthaprabhu2)

Latest Videos

 

ఈ మాటలకు సమంత తెగ సంతోష పడిపోయింది.తనను ఇంతలా అభినందించినందకు సమంత కూడా ఎమోషనల్ గానే రిప్లై ఇచ్చింది. “ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను” అంటూ.. బన్నీ కామెంట్స్ కుసంబంధింన వీడియోను షేర్ చేసింది సమంత. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చి.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోంస కోవా చేరింది సమంత. అటు నాగచైతన్య కూడా ప్రస్తుతం గోవాలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్ళాడు.

Also Read ; Samantha : ఫ్రీ బర్డ్ లైఫ్... సమంత కోరుకున్నది ఇదేనా?

click me!