Liger First Glimpse: మీట్ ది బీస్ట్... న్యూ ఇయర్ 2022 కానుకగా లైగర్ ఫస్ట్ గింప్స్

Published : Dec 29, 2021, 12:50 PM IST
Liger First Glimpse: మీట్ ది బీస్ట్... న్యూ ఇయర్ 2022 కానుకగా లైగర్ ఫస్ట్ గింప్స్

సారాంశం

విజయ్ దేవరకొండ (Vijay devarakonda) ఫస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ హైప్ నెలకొని ఉండగా... ఫస్ట్ గ్లిమ్ప్స్ పై ప్రకటన చేశారు.

స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు నెలల్లో పూర్తి చేసి విడుదల చేయడం దర్శకుడు పూరి (Puri Jagannadh) స్టైల్. థాయిలాండ్ సముద్ర తీరంలో కూర్చొని 15 రోజుల్లో స్క్రిప్ట్ మొత్తం రాసుకుంటాడు. అనుకున్న స్క్రిప్ట్ రోజుల వ్యవధిలో తెరపైకి తెస్తాడు. పూరి లాంటి డైరెక్టర్ తో మూవీ చేయడం నిర్మాతలకు వరమని చెప్పాలి. అయితే లైగర్ మూవీ విషయంలో పూరి లెక్కలు తప్పాయి. లైగర్ సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు అవుతుంది. పూరి కెరీర్ లో ఇంత సమయం ఏ మూవీకి కేటాయించలేదు. 

ఈ జాప్యంలో పూరి ప్రయత్న దోషం ఏమీ లేదు. నెలల కొద్దీ కొనసాగిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ముందుకు జరగలేదు. విదేశాలలో అనుకున్న షెడ్యూల్స్ కి ఆటంకం ఏర్పడింది. ఈ కారణాల చేత లైగర్ షూటింగ్ ఆలస్యమైంది. లైగర్ మూవీ అప్డేట్స్ కూడా చాలా అరుదుగా వస్తున్నాయి. అయితే న్యూ ఇయర్ కానుకగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి పూరి టీమ్ బిగ్ ట్రీట్ ఇవ్వనున్నారు. లైగర్ మూవీకి సంబంధించిన మేజర్ అప్డేట్ పంచుకున్నారు. 

న్యూ ఇయర్ 2022 (New Year 2022) సెలెబ్రేషన్స్ పురస్కరించుకొని డిసెంబర్ 31న లైగర్ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ (Liger first glimpse) విడుదల చేయనున్నారు. ఉదయం 10:03 నిమిషాలకు లైగర్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. విజయ్ దేవరకొండ మొదటి సారి ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్నారు. వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ లైగర్ మూవీలో నటించడం మరో విశేషం. టైసన్ నటిస్తున్న ఫస్ట్ ఇండియన్ మూవీ లైగర్. 

Also read Bheemla Nayak update: భీమ్లా నాయక్ నుండి బ్లాస్టింగ్ అప్డేట్.. న్యూ ఇయర్ కి మోత మోగాల్సిందే!

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లైగర్ మూవీలో భాగస్వామిగా ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ పూరి కనెక్ట్స్ బ్యానర్ తో కలిసి లైగర్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. మణిశర్మ లైగర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Also read Vijay Devarakonda : అల్లు అర్జున్ తరువాత విజయ్ దేవరకొండనే... రౌడీ హీరో రికార్డ్.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌