చివరకు ఫార్మల్ లాంచ్ కూడా జరగకుండా ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లిపోయింది. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెలు వచ్చాయన్నారు. అయితే త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీడియాలో,సోషల్ మీడియాలో మరో ప్రచారం సాగుతోంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఇప్పుడంటే ఆగిపోయిందని అఫీషియల్ గా తెలిసింది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ముందే పసిగట్టింది. ఈ చిత్రం ఆగిపోయిందని.. మహేష్ బాబుతో ముందు సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడని ప్రచారం చేసారు. మరోవైపు తారక్ కూడా ఏం స్పందించకపోవడంతో ఇది నిజమే అని అభిమానులు కూడా నమ్మారు. చివరకు ఫార్మల్ లాంచ్ కూడా జరగకుండా ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లిపోయింది. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెలు వచ్చాయన్నారు. అయితే త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీడియాలో,సోషల్ మీడియాలో మరో ప్రచారం సాగుతోంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇంక కలిపి సినిమా చెయ్యకపోవచ్చు అంటూ చర్చ జరుగుతోంది. కథనాలు వచ్చేస్తున్నాయి. క్రియేటివ్ డిఫరెన్స్ లు పెరిగి పెద్దవై ఇద్దరూ విడిపోయే స్దాయికి వెళ్లాయని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియదు. కాకపోతే ఇక్కడో విషయం తెలుసుకోవాలి. సినిమాల్లో క్రియేటివ్ డిఫెరెన్స్ లు రావటం ప్రాజెక్టులు కాన్సిల్ కావటం కామన్..దాంతో కొద్దికాలం రిలేషన్స్ బ్రేక్ అవ్వచ్చు. కానీ అది తాత్కాలికమే.
ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేత లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. 2020లో అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మహేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. 2021 ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టి 2022 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని వినపడుతోంది. మరోప్రక్క కొరటాలతో ఎన్టీఆర్ సినిమా మొదలు కాబోతోంది.
రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. దాంతో కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడు కొరటాల. ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. పైగా రాజమౌళి లాంటి దర్శకుడితో చేసిన తర్వాత ఆ హీరో మళ్లీ వెంటనే హిట్ కొట్టడం అనేది చరిత్రలో లేదు. కాబట్టి కొరటాల దాన్ని ఎలా బ్రేక్ చేయబోతున్నాడనేది ఆసక్తికరమైన విషయం.