మెడికల్‌ ఎమర్జెన్సీ.. నిఖిల్‌ని అడ్డుకున్న పోలీసులు.. తొమ్మిసార్లు విఫలం..

Published : May 24, 2021, 08:06 AM IST
మెడికల్‌ ఎమర్జెన్సీ.. నిఖిల్‌ని అడ్డుకున్న పోలీసులు.. తొమ్మిసార్లు విఫలం..

సారాంశం

మెడికల్‌ ఎమెర్జెన్సీ కోసం బయటకు వచ్చిన హీరో నిఖిల్‌కి చేదు అనుభవం ఎదురైంది. లాక్‌ డౌన్‌ నిబంధనల దృష్ట్యా ఆయన్ని పోలీసులు ఆడ్డుకున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.

మెడికల్‌ ఎమెర్జెన్సీ కోసం బయటకు వచ్చిన హీరో నిఖిల్‌కి చేదు అనుభవం ఎదురైంది. లాక్‌ డౌన్‌ నిబంధనల దృష్ట్యా ఆయన్ని పోలీసులు ఆడ్డుకున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. రాష్ట్రలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎవరినీ ఉపేక్షించడం లేదు. అనవసరంగా రోడ్డుపైకి వస్తే వహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో వ్యక్తి ఎవరనేది కూడా చూడటం లేదు. తాజాగా హీరో నిఖిల్‌కి అలాంటి పరిస్థితే ఎదురైంది. 

ఆదివారం అత్యవసరమైన వైద్య సామాగ్రి పంపిణీ చేయడానికి వెళ్లిన హీరో నిఖిల్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.  ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. `కొవిడ్‌ వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారుని ఆపేశారు. ప్రిస్క్రిప్షన్, రోగి వివరాలను అందించినప్పటికీ  పోలీసులు నాకు అనుమతి ఇవ్వలేదు. ఈ పాస్‌ ఉండాల్సిందేనని చెప్పారు.  9 సార్లు ప్రయత్నించాను. కానీ సర్వర్ డౌన్ అయింది. వైద్య అత్యవసర పరిస్థితులకు అనుమతిస్తారని భావించి నేను వచ్చాను` అంటూ నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. 

నిఖిల్‌ ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం.. `డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం` అని రిప్లై ఇచ్చింది. దీంతో సమస్య పరిష్కారమైంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?
Rakul Preet Singh: 7 దేశీ లుక్స్‌లో అదరగొట్టిన రకుల్.. అచ్చమైన ఇండియన్ బ్యూటీ ఎలా ఉందంటే?