మరోసారి గొప్ప మనసుని చాటుకున్న చిరంజీవి.. ఫోటో జర్నలిస్ట్ కి సాయం..

Published : May 24, 2021, 08:36 AM IST
మరోసారి గొప్ప మనసుని చాటుకున్న చిరంజీవి.. ఫోటో జర్నలిస్ట్ కి సాయం..

సారాంశం

ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా  సేవ‌ల్ని అనంతంగా చేస్తున్నారు. గతంలోనూ పలువురు జ‌ర్న‌లిస్టుల‌కు సాయం అందించిన చిరంజీవి తాజాగా భ‌ర‌త్ భూష‌ణ్ అనే ఫోటో జ‌ర్న‌లిస్ట్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు.

గతేడాది క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో సీసీసీ ద్వారా సినీ కార్మికుల‌ను ఆదుకోవడంలో ముందున్నారు చిరంజీవి. త్వరలో క‌రోనా రోగులను ఆదుకునేందుకు ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌లో ధీనస్థితిలో ఉన్న పావ‌ల శ్యామ‌ల‌కు, అలాగే  కోరోనాతో మృతి చెందిన ప‌లువురు వీరాభిమానుల కుటుంబాల‌ను ఆదుకుంటున్నారు. కోరోనా వచ్చి ఇబ్బంది పడుతున్న అభిమానులకు ల‌క్ష‌ల్లో సాయం చేశారు. తన అభిమాని వార‌సులు పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా  సేవ‌ల్ని అనంతంగా చేస్తున్నారు. 

గతంలోనూ పలువురు జ‌ర్న‌లిస్టుల‌కు సాయం అందించిన చిరంజీవి తాజాగా భ‌ర‌త్ భూష‌ణ్ అనే ఫోటో జ‌ర్న‌లిస్ట్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఆయన ఆపదలో ఉన్నారని తెలిసి తనవంతు సాయంతో అందించారు. ఈ చెక్కును చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు భరత్ భూషణ్ కి అందజేశారు.  సాయం అందుకున్న భ‌ర‌త్ భూష‌ణ్ మాట్లాడుతూ, ఆప‌ద్భాంద‌వుడిలా ఈ క‌ష్ట‌కాలంలో చిరంజీవి గారు మ‌మ్మ‌ల్ని ఆదుకున్నందుకు రుణ‌ప‌డి ఉన్నాము. ఆయ‌న పెద్ద‌మ‌న‌సుకు కృత‌జ్ఞ‌త‌లు` అని తెలిపారు. ప్రస్తుతం భరత్‌ భూషణ్‌ కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌