
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై ఇటీవల అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మూడో భార్య లెజ్‌నెవాతో విడాకులు తీసుకుంటున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రూమర్లపై పవన్ కల్యాణ్ ఏనాడూ పెదవి విప్పకపోవడం మరింత ఆసక్తి పెరిగింది
ప్రస్థుతం పవన్ కల్యాణ్ బోస్టన్ లో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 2017 సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్నారు. పవన్ తో పాటు తన భార్య లెజ్‌నెవా కూడా కలిసి వెళ్లడం పవన్ వైవాహిక జీవితంపై వస్తున్న అనేక రూమార్లకు అడ్డుకట్టవేసింది. అమెరికాలో పర్యటిస్తున్న పవన్ దంపతుల మధ్య సంబంధాలు సానుకూలంగా ఉన్నట్టు ఫొటోల ద్వారా స్పష్టమైంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పవన్ వైవాహిక జీవితం మళ్లీ చిక్కుల్లో పడుతోందనే వార్తలు అభిమానులను, కార్యకర్తలను, చివరకి కుటుంబ సభ్యులను కూడా ఆందోళనకు గురిచేశాయి.
అయితే అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్, లెజినెవా దంపతుల తాజా చిత్రాలు వారి మధ్య వివాదాలేమీ లేవని స్పష్టం చేస్తున్నాయి. దీంతో అభిమానులు, కార్యకర్తలు సంతోషంగా ఫీలవుతున్నారు. మూడో భార్యగా లెజ్‌నెవాతో వివావాహానికి ముందు పవన్ చేసుకొన్న రెండు పెళ్లిళ్లు వివాదాస్పదంగా మారాయి.
వ్యక్తిగత విభేదాల కారణంగా నందిని నుంచి పవన్ విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత బద్రి చిత్రంలో నటించిన రేణుదేశాయ్‌ను వివాహం చేసుకొన్నారు. వారికి అఖిరా, ఆరాధ్య పిల్లలు కలిగారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో రేణు, పవన్ విడిపోయారు. అనంతరం లెజ్‌నెవాను వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం వీరిద్దరికి ఓ పాప కూడా పుట్టింది.
బోస్టన్ సదస్సుకు మాధవన్‌తో కలిసి పవన్ బోస్టన్ జరిగే సమావేశంలో బాలీవుడ్ నటుడు మాధవన్‌తో కలిసి పాల్గొననున్నారు. ఫిబ్రవరి 11, 12 తేదీలలో హర్వర్డ్ యూనివర్సిటీలో 14వ ఇండియా కాన్ఫరెన్స్ 2017 సదస్సులో యువతకు స్ఫూర్తి కలిగించేలా ప్రసంగించనున్నారు.