'రంగు' వివాదం.. తనీష్ క్లారిటీ!

By Udayavani DhuliFirst Published Nov 15, 2018, 10:03 AM IST
Highlights

బిగ్ బాస్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తనీష్ కి ప్రేక్షకుల్లో గుర్తింపు లభించింది. హౌస్ లో ఉన్నంతకాలం కౌశల్ తో గొడవ పడి వార్తల్లో నిలిచేవాడు. తాజాగా మరో వివాదంతో వార్తల్లోకెక్కాడు. తనీష్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తికేయ 'రంగు' అనే సినిమాను రూపొందించారు. 

బిగ్ బాస్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తనీష్ కి ప్రేక్షకుల్లో గుర్తింపు లభించింది. హౌస్ లో ఉన్నంతకాలం కౌశల్ తో గొడవ పడి వార్తల్లో నిలిచేవాడు. తాజాగా మరో వివాదంతో వార్తల్లోకెక్కాడు.

తనీష్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తికేయ 'రంగు' అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో తనీష్ విజయవాడకి చెందిన లారా అనే రౌడీ పాత్రలో 
కనిపించనున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాలో లారాని రౌడీ షీటర్ గా చూపించడంపై అతడు కుటుంబ సభ్యులు గొడవకి దిగారు. సినిమాను చూపించమని దర్శకుడిని కోరినా వారు స్పందించడం లేదని సినిమాను విడుదల కానివ్వమని మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ విషయంపై స్పందించిన దర్శకనిర్మాతలు సినిమాలో లారాని ఎక్కడా తప్పుగా చూపించలేదని, సినిమా చూసిన తరువాత లారాపై మంచి అభిప్రాయం కలుగుతుందని అన్నారు.

శని, ఆదివారాల్లో లారా కుటుంబానికి షో వేసి సినిమా చూపిస్తామని అన్నారు. తనీష్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. మనిషి ఈ సమాజంలో ఎలా ఉండకూడదో చెప్పే విధంగా ఈ సినిమా ఉంటుందని, లారా పాత్ర అతడి ఐడియాలజీ అన్నీ ఈ సినిమాలో ఉంటాయని అన్నారు. సినిమా చూస్తే వాళ్ల కుటుంబ సభ్యులకు కళ్లలో నీళ్లు తిరుగుతాయని అన్నారు. 

సంబంధిత వార్త.. 

తనీష్ కి షాక్.. సినిమా విడుదల కానివ్వమని వార్నింగ్!

click me!