
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే సోషల్ మీడియాలోకి వచ్చేసి అందరినీ బాధిస్తోంది. కొందరు సరదా కోసం ఈ సినిమాను పైరసీ చేయడంతో ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాకముందే ఈ సినిమా జనాల ఫోన్లలోకి వచ్చేసింది.
ఆ ప్రింట్ ని ఓ టోరెంట్ సైట్ వాళ్లు తమ సైట్ లో పెట్టేసారు. దాంతో ఇప్పుడు చాలా మందికి సినిమా రిలీజ్ కు ముందే చూసేసే పరిస్దితి వచ్చేసింది. ఈ నేఫధ్యంలో ఈ సినిమా ఇలా పైరసీ అవ్వటాన్ని నిరసిస్తూ..చాలా మంది మద్దుతు తెలుపుతున్నారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ ఈ మేరకు ఓ వీడియో తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.
ఈ వీడియోలో ఇంతకు ముందు ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రానికి జరిగింది. ఇప్పుడు టాక్సీవాలా సినిమాకు జరిగింది. టాక్సీవాలా టీమ్ చాలా కష్టపడింది. ఆ డైరక్టర్ నాకు తెలుసు. కష్టపడి సినిమా తీసారు.. కాబట్టి ఆ పైరసీ ప్రింట్ చూడవద్దని థియోటర్స్ కు వచ్చి సినిమా చూడమని చాలాఎమోషనల్ గా అన్నారు. ఈ పోస్ట్ ని రీట్వీట్ చేస్తూ...విజయ్ దేవరకొండ ధాంక్స్ చెప్పారు.
మరో ప్రక్క ఈ సినిమా పైరసీ వెర్షన్ చూసేసిన వారు ఏవరేజ్ అంటూ తేల్చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు ధీటుగా విజయ్ దేవరకొండ స్పెషల్ వీడియో సిద్ధం చేసి వదిలాడు. ఈ వీడియోలో కొందరు పిల్లలు వచ్చి విజయ్ దేవరకొండతో మాట్లాడతారు.
ఆ పిల్లల్లో ఒకరు 'టాక్సీవాలా మేం చూశాం.. ఏవరేజ్' అని చెప్పగా.. అది విన్న విజయ్ షాక్ తిని 'సినిమా ఇంకా విడుదల కాలేదు కదా ఎలా చూశారు..?' అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా 'ఫోన్ లో ఉందిలే' అని చెబుతారు.
అది విన్న విజయ్ పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్, డిఐ, మ్యూజిక్ వర్క్ పూర్తి కాకుండా లీకైన సినిమా అంటూ వారికి అర్ధమయ్యే విధంగా చెబుతాడు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.. రాహుల్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించగా.. మరో ముఖ్య పాత్రలో మాళవిక నాయర్ నటించింది.