
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా మూవీ ‘తమ్ముడు. ఈసినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలోనే తమ్ముడు సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ ట్రైలర్ తో తమ్ముడు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
తమ్ముడు ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కథ మొత్తం అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే బంధం చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. చిన్నప్పటి నుండి తన అక్క చేత "తమ్ముడు" అని పిలిపించుకోవాలని కలలుగన్న యువకుడి పాత్రలో నితిన్ కనిపించారు. ఒక పిలుపు కోసం ఎంతటి సాహసానికైనా వెనకాడని వ్యక్తిత్వాన్ని ఈ పాత్రలో ఆయన చూపించాడు.
ఎమెషనల్, సెంటిమెంట్ స్టోరీకి యాక్షన్ టచ్ ఇచ్చి సినిమాను తన మార్క్ సీన్లతో తెరకెక్కించాడు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ లో ఆయన రాసిన సెంటిమెంట్స్ సీన్స్ కు లేడీస్ కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు. ఈక్రమంలో ఈసినిమా ద్వారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ను ఏడించబోతున్నాడు. భారీ బడ్జెట్, భావోద్వేగ భావనలు, కుటుంబ సంబంధాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా 'కాంతార' ఫేమ్ సప్తమీ గౌడ , వర్ష బొల్లమ్మ నటించారు. ఇక ఇద్దరు హీరోయిల్లతో పాటు నితిన్ నటన కూడా తమ్ముడు సినిమాలో అదిరిపోయింది.
చాలా కాలం తరువాత సీనియర్ నటి లయ ఈ సినిమాతో మళ్లీ తెరపైకి రాబోతున్నారు. ఆమె నితిన్ అక్కగా కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. లయ పాత్ర వల్ల ఈ సినిమా కథ చాలా మలుపులు తిరుగుతుంది. ఈ విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. టెక్నికల్ గా ట్రైలర్ సాలిడ్ గా ఉంది. బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఆడియన్స్ లో కలిగింది.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. నితిన్ సరసన కాంతార ఫేమ్ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీనియర్ నటి లయ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌరభ్ సచ్ దేవా, స్వాసిక, హరితేజ, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.