మీరేం ఊహిస్తున్నారో తెలియదు, అంతకి మించి ఉంటుంది.. హరిహర వీరమల్లు ట్రైలర్ పై అంచనాలు పెంచేసిన నాగవంశీ

Published : Jun 30, 2025, 05:43 PM IST
harihara veeramallu, pawan kalyan, hhvm

సారాంశం

జూలై 3న విడుదల కానున్న హరి హర వీర మల్లు ట్రైలర్ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ పై తాజాగా నాగవంశీ అంచనాలు మరింత పెంచేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు మూవీ జూలై 24న రిలీజ్ కి రెడీ అవుతోంది. పీరియాడిక్ యాక్షన్ చిత్రం గా రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ జూలై 3, 2025న విడుదల కానుంది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ లో నిర్మించారు. అయితే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాకముందే మరో నిర్మాత చేసిన వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేస్తున్నాయి. భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశీ చేసిన తాజా పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. మీరు ఏమి ఊహిస్తున్నారో నాకు తెలియదు... కానీ జూలై 3న మీరు ఊహించని అనుభూతికి సిద్ధంగా ఉండాలి. హరి హర వీర మల్లు ట్రైలర్ అసలు మామూలుగా ఉండదు. ఇది స్కేల్, మ్యాడ్‌నెస్, ఎనర్జీతో ముంచెత్తబోతోంది అంటూ అంచనాలు పెంచేశారు. 

 

 

ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. కొంతమంది అభిమానులు ట్రైలర్‌కు ముందు చిన్న ప్రోమో వస్తే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో '#HariHaraVeeraMallu' ట్రెండింగ్‌లో ఉంది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. నటుడు నాజర్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ భారీ చిత్రం పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు జూలై 3 తేదీ ప్రత్యేకంగా మారనుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులంతా ఈ ట్రైలర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..