వాచ్‌మన్‌గా మారిన అజిత్ సినిమా నటుడు, సహాయం కోసం ఎదురుచూపు

Published : Jun 29, 2025, 09:58 PM IST
వాచ్‌మన్‌గా మారిన అజిత్ సినిమా నటుడు, సహాయం కోసం ఎదురుచూపు

సారాంశం

 అజిత్  హీరోగా వచ్చిన  ఆరంభం సినిమాలో నటించిన ఒక నటుడు ప్రస్తుతం  పేదరికంలో మగ్గుతున్నాడు. వాచ్ మెన్ గాా పనిచేస్తున్నాడు. ఇంతకీ ఎవరా నటుడు. 

సినిమాల్లో రాణించాలని కలలు కంటూ వచ్చిన ప్రతి ఒక్కరికీ అనుకున్నట్టుగా అవకాశాలు  దొరకవు. కాని కొన్ని సందర్భాల్లో మాత్రం  సినిమా అనేది సామాన్యులను కూడా సెలబ్రిటీలను చేస్తుంది. కాని ఎవరి రాత ఎలా ఉంటుందోే మాత్రం చెప్పడం కష్టం. అవకాశాలు రాక ఇండస్ట్రీలో ఇబ్బందిపడే వారు చాలామంది ఉన్నారు. వచ్చిన అవకాశాలు అందుకుని పై స్థాయికి వచ్చినవారు కూడా ఉన్నారు. ఈక్రమంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఓ నటుడు ప్రస్తుతం వాచ్ మెన్ గా జీవనం సాగిస్తున్నాడు.  

ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చినవారే. మెగాస్టార్ చిరంజీవి,  సూపర్ స్టార్ రజినీకాంత్, నాని, శివకార్తికేయన్, లాంటి నటులుు ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్స్ అయ్యారు. అదే విధంగా అజిత్ కూడా సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి తన ప్రతిభతో ఎదిగారు. నటుడిగానే కాకుండా స్పోర్ట్స్‌లో కూడా రాణిస్తున్నారు.

కార్ రేస్‌లలో పాల్గొని, భారతదేశానికి గర్వకారణమైన అవార్డులెన్నో సాధిస్తున్న  అజిత్‌కు ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.  రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అజిత్ తన కుటుంబ సమేతంగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టార్స్ నుంచి  అభినందనలు వెల్లువల వచ్చాయి. 

అయితే అజిత్ నటించిన సినిమాలో పనిచేసిన ఒక నటుడ మాత్రం  దయనీయ స్థితిలో ఉన్నాడు. సినిమాల్లో స్టార్ అవ్వాలని వచ్చి, ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ నటుడు ఇప్పుడు పేదరికంలో మగ్గుతూ వార్తల్లో నిలిచాడు.  "2013లో విష్ణువర్ధన్ దర్శకత్వంలో అజిత్ నటించిన సినిమా 'ఆరంభం'. ఈ సినిమాలో టెర్రరిస్ట్ గ్యాంగ్‌లో ఒకరిగా నటించారు సవి సింధు. లక్నోకు చెందిన సవి సింధు లా చదివారు, అయినప్పటికీ సినిమాల మీద ఉన్న ఆసక్తితో నటన వైపు వచ్చారు.

కానీ అనుకున్న విధంగా సినిమా అవకాశాలు రాలేదు. ఒకానొక సమయంలో కుటుంబం కూడా దూరం అయ్యింది. ఇప్పుడు జీవనోపాధి కోసం వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. చాలా మంది సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని అంటున్నాడు సవి. ఇస్తామని అంటారే కాని ఎవరు అవకాశాలు ఇచ్చింది లేదని బాధపడుతున్నాడు సవి.

'ఆరంభం'తో పాటు చాలా బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు సవి సింధు. కానీ ఆ పాత్రలు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. రోజుకు 12 గంటలు వాచ్‌మన్‌గా పనిచేసినా, తన అవసరాలు తీర్చుకోలేకపోతున్నానని, సినిమాలు చూడటం ఇష్టమని, కానీ థియేటర్‌కు వెళ్లే స్థోమత కూడా తనకు లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నాడు సవి.  బాలీవుడ్ ప్రముఖుల నుండి సాయం అందుతుందేమో అని కూడా ఎదురు చూస్తున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..