మరో వివాదంలో హీరో విజయ్!

Published : Jun 27, 2021, 10:34 AM IST
మరో వివాదంలో హీరో విజయ్!

సారాంశం

విజయ్ మూవీస్ టైటిల్స్ పై తమిళ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా ఆయన తన చిత్రాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 

తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్. చాలా వివాదాలు ఆయన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన ప్రతి మూవీ వివాదాస్పదం అవుతుంది. తాజాగా విజయ్ మూవీస్ టైటిల్స్ పై తమిళ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా ఆయన తన చిత్రాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 


తమిళ చిత్రాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టకూడదనే నియమం చాలా కాలంగా ఉంది. తమిళ టైటిల్ వలన సదరు చిత్రాలకు ప్రభుత్వ ప్రోత్సహకాలు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ టైటిల్స్ నేపథ్యంలో టాక్సేషన్ ఎక్కువగా ఉంటుంది. కాగా విజయ్ గత చిత్రం మాస్టర్ ఇంగ్లీష్ టైటిల్, ఆయన తన లేటెస్ట్ మూవీకి బీస్ట్ అని టైటిల్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తన చిత్రాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం ద్వారా ఆయన తమిళ భాషకు అన్యాయం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. 


వందకు పైగా చిత్రాలు చేసిన రజినీకాంత్ ఒక్క ఇంగ్లీష్ టైటిల్ కూడా వాడలేదని, విజయ్ మాత్రం తరచుగా ఇంగ్లీష్ టైటిల్స్ వాడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నిరసనల నేపథ్యంలో విజయ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం