బాయ్ ఫ్రెండ్ కి టైట్ హగ్... అర్జున్ కి మలైకా రొమాంటిక్ విషెస్

Published : Jun 27, 2021, 08:34 AM IST
బాయ్ ఫ్రెండ్ కి టైట్ హగ్... అర్జున్ కి మలైకా రొమాంటిక్ విషెస్

సారాంశం

నిన్న అర్జున్ కపూర్ తన బర్త్ డే జరుపుకున్నారు. బాలీవుడ్ సెలెబ్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రేయసి మలైకా మరింత రొమాంటిక్ గా ప్రేమగా అర్జున్ కపూర్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు.

బాలీవుడ్ క్రేజీ కపుల్ ఎవరంటే మలైకా అరోరా, అర్జున్ కపూర్. స్టార్స్ మధ్య బాలీవుడ్ లో అఫైర్స్, డేటింగ్స్ వెరీ కామన్. వీరి ప్రేమకు ప్రత్యేకత ఏమిటంటే వయసు అలాగే నేపధ్యాలు వేరు. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని వివాహం చేసుకున్న మలైకా అరోరా విడాకులు ఇచ్చారు. ఇప్పుడు ఆమె వయసు 40ప్లస్. ఇక అర్జున్ కపూర్ వయసు 30ప్లస్. మలైకాకు అర్హాన్ అనే ఓ టీనేజ్ అబ్బాయి ఉన్నాడు. అర్జున్ కపూర్ కి ఇంత వరకు పెళ్ళికాలేదు. 


ఇన్ని వ్యత్యాసాలు ఉన్న ఈ జంట సమాజాన్ని, సాంప్రదాయాలను పక్కనబెట్టి విచ్చలవిడిగా ప్రేమించుకుంటున్నారు. కలిసి పార్టీలు, పబ్ లు, విందులు, విహారాలు... ఒకటేమిటి ఎక్కడైనా జంటగా కనిపిస్తారు . బాలీవుడ్ పెద్దలు కూడా ముక్కున వేలువేసుకుంటున్న వీరి వ్యవహారం ఎలా ముగుస్తుందో అనేది ఆసక్తికర అంశం. 


కాగా నిన్న అర్జున్ కపూర్ తన బర్త్ డే జరుపుకున్నారు. బాలీవుడ్ సెలెబ్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రేయసి మలైకా మరింత రొమాంటిక్ గా ప్రేమగా అర్జున్ కపూర్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. అర్జున్ కపూర్ ని గుండెలకు హత్తుకున్న ఫోటో పంచుకున్న ఆమె ' హ్యాపీ బర్త్ డే మై సన్ షైన్' అంటూ కామెంట్ పెట్టారు. అర్జున్ కపూర్ కి మలైకా బర్త్ డే విషెష్ చెప్పిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్