
46 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళిచేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండిపోయాడు తమిళస్టార్ హీరో విశాల్. రెండు సార్లు ఈ స్టార్ హీరో పెళ్ళి ఆగిపోయింది. ఇక ముచ్చటగా మూడోసారి ఓ యాక్ట్రస్ ను పెళ్ళాడబోతున్నట్టు ప్రకటించాడు. మరోసారి తన పెళ్ళి ఎప్పుడు ఏంటీ అనేది తరువాత చెపుతానన్నారు. ఇంకోసారి తన దృష్టంతా సినిమాలపైనే అన్నాడు. ఇక గతంలో శరత్ కుమార్ తనయ.. వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపించి.. బ్రేకప్ చెప్పుకున్నారు. కాని తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అంటుంటాడు. అయితే ఈసారి విశాల్ అడ్డంగా బుక్ అయ్యాడు. ఓ అమ్మాయితో షికారు చేస్తూ కనిపించాడు.
విశాల్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం విశాల్ న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళాడు. ఈక్రమంలో అక్కడ వీధుల్లో ఎవరో అమ్మాయితో విశాల్ చక్కర్లు కొడుతూ కనిపించారు. తనని వీడియో తీస్తున్నారని గమనించిన విశాల్ వెంటనే తన మొహాన్నిజర్కిన్ తో దాచుకున్నారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజెన్స్.. ఆ అమ్మాయి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే కొంతమంది మాత్రం ఇది ప్రమోషన్ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. విశాల్ తన సినిమా షూటింగ్ కోసమే న్యూయార్క్ వెళ్లారని చెబుతున్నారు. కోలీవుడ్ హీరో విశాల్ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గా మార్క్ ఆంటోనీ అనే టైం ట్రావెల్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న విశాల్ ప్రస్తుతం రత్నం, డిటెక్టివ్2 సినిమాల్లో నటిస్తున్నారు.
అయితే ఇది అంతా ఇదంతా ఫేక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కావాలని మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారంటూ.. కామెంట్లు పెడుతున్నాడు. అయితే ఈ విషయంలో నిజా నిజాలు ఏంటీ అనేది విశాల్ స్పందిస్తే కాని తెలియదు. ప్రస్తుతం విశాల్ హరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో పూజ, పొగరు రెండు సూపర్ హిట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి రత్నంతో హ్యాట్రిక్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.