
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అరుదైన సన్నివేశం చూడబోతున్నాం. టాప్ హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకునే సందర్భం రాబోతుంది. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు అనేంతటి దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. టాలీవుడ్ టాప్ హీరోలు ఒక్క వేదికపైకి రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహాం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. ఈ అరుదైన కలయికకి వెంకటేష్ కారణం కాబోతున్నారు. ఆయన సినిమా కారణం కాబోతుందట.
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం `సైంధవ్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌కి మైలు రాయిలాంటి మూవీ. ఆయన నటిస్తున్న 75వ చిత్రం కావడం విశేషం. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. రేపు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. `కళియుగ పాండవులు` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. మరో హీరో హ్యాండివ్వడంతో తండ్రి, నిర్మాత రామానాయుడు.. వెంకీని విదేశాల నుంచి పిలిపించాడు. నువ్వే హీరో అని ప్రకటించాడు. అప్పటికప్పుడు యాక్టింగ్ నేర్పించి ఆ సినిమా చేయించాడు.
అలా అనుకోకుండా హీరో అయిన వెంకీ ఇప్పుడు 75వ సినిమా మైలు రాయికి చేరుకున్నాడు. దీంతో ఈ అరుదైన సందర్భాన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాడు వెంకీ. ఇండస్ట్రీ పెద్దలతో కలిసి సెలబ్రేట్ చేయాలని భావించడట. తన సమకాలీకులు, స్నేహితులు చిరంజీవి, నాగార్జున, బాలయ్యలను `సైంధవ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి, తన 75వ మూవీకి సంబంధించిన ప్రత్యేక ఈవెంట్‌కి ఆహ్వానించినట్టు సమాచారం. రేపు(డిసెంబర్ 27న) బుధవారం జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగబోతుంది. మరి ఈ చిరు, బాలయ్య, నాగ్ ఈ ఈవెంట్‌లో కలుస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.ఈ వార్త టాలీవుడ్‌లో అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇక వెంకటేష్ నటించిన `సైంధవ్` మూవీకి `హిట్` చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ట్రైలర్ రానుంది.