తమ్ముడు ఎన్టీఆర్‌ సినిమా గురించి క్రేజీ విషయాలు చెప్పిన కళ్యాణ్‌ రామ్‌.. ఈ మాత్రం చాలు చెలరేగిపోవడానికి..

Published : Dec 26, 2023, 05:01 PM IST
తమ్ముడు ఎన్టీఆర్‌ సినిమా గురించి క్రేజీ విషయాలు చెప్పిన కళ్యాణ్‌ రామ్‌.. ఈ మాత్రం చాలు చెలరేగిపోవడానికి..

సారాంశం

కళ్యాణ్‌ రామ్‌ తమ్ముడు ఎన్టీఆర్‌ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, `దేవర` సినిమా అప్‌ డేట్‌ ఇచ్చారు.

కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం `డెవిల్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతుంది. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా చేసింది. మాళవిక నాయర్‌ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కళ్యాణ్‌ రామ్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. `డెవిల్‌` ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుందని తెలిపారు. 1940లో కథ జరుగుతుందని, షేర్లాక్‌ హోమ్స్ తరహాలో సినిమా సాగుతుందని తెలిపారు. 

ఈ సందర్భంగా తమ్ముడు ఎన్టీఆర్‌ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, `దేవర` సినిమా అప్‌ డేట్‌ ఇచ్చారు. ఆ మధ్య త్వరలోనే గ్లింప్స్ విడుదల చేస్తామన్నారు. జనవరి 8న ఆ గ్లింప్స్ రానుందని తెలుస్తుంది. తాజాగా ఆయన `దేవర` షూటింగ్‌ విషయాలను పంచుకున్నారు. గతంలో ఎప్పుడూ చూడనంత విజువల్‌ ట్రీట్‌ లా ఉండబోతుందట. అయితే ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం అన్నారు. ప్రొడక్షన్‌ పరంగా చాలా ఇబ్బంది ఏర్పడిందన్నారు. 

ఓ సీన్‌ కోసం ఏకంగా భారీ సంప్‌ని తవ్వాల్సి వచ్చిందట. షూటింగ్‌ పరంగా చాలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇక ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్‌ పూర్తయ్యిందని తెలిపారు కళ్యాణ్‌ రామ్‌. త్వరలోనే మిగిలిన షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తామన్నారు. అయితే `దేవర` సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ తెలిపారు. కథ స్పాన్‌ ఎక్కువగా ఉండటంతో ఒక్క పార్ట్ లో చేయడం కష్టమవుతుందని, అందుకే రెండుగా చేస్తున్నట్టు తెలిపారు. 

ప్రస్తుతం మొదటి పార్ట్ కి సంబంధించిన షూటింగ్‌ మాత్రమే చేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ పార్ట్ అయిపోయాక రిలీజ్‌ తర్వాతనే రెండో పార్ట్ కి వెళ్దామనుకుంటున్నట్టు సమాచారం. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ జరుపుతున్నట్టు చెప్పారు. దర్శకుడు కొరటాల శివ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, ఆయన వర్క్ తెరపై కనిపిస్తుందన్నారు. అయితే `ఆచార్య` రిజల్ట్ తర్వాత ఆయన్ని నమ్మడంపై స్పందిస్తూ, కొరటాలని ఎందుకు అంతగా నమ్మామనేది `దేవర` గ్లింప్స్ చూశాక అర్థమవుతుందన్నారు. ఔట్‌పుట్‌ పై నమ్మకంతో ఉన్నాం. అందుకే రిలీజ్‌ డేట్ ఇచ్చామని తెలిపారు. తాము కంటెంట్‌పై నమ్మకం ఏర్పడిన తర్వాతనే స్పందించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు కళ్యాణ్‌ రామ్‌. దీంతో తారక్‌ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ఈ మాత్రం హింట్‌ ఇస్తే చాలు తాము చెలరేగిపోతామనంటున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్